ఆర్టీసీ వ్యవస్థ అనేది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులనుక వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. అలానే ఆర్టీసీ సంస్థ కూడా ప్రజల కోసం సౌకర్యాలను కల్పిస్తూ వచ్చింది. ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ లు చెబుతుంది. అలానే అనేక ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇక టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాఖీ పండగ సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పౌర్ణమీ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను తాత్కాలికంగా నిలిపివేసినటలు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఊర్లకు వెళ్లే వారితో బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని.. ఆ సమయంలో టీ-9 టికెట్లను మంజూరు చేయడం సిబ్బందికి కష్టంగా మారతుందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ టికెట్లను జారీ చేసే సమయంలో ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టీమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. అలానే రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు టి-9 టిక్కెట్ ఇష్యూ చేసేందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలోనే టీ-9 టికెట్లను తాత్కాలికంగా నిలిపివేయాలని సంస్థ నిర్ణయించిందని చెప్పారు. ఆగష్టు 29 మంగళవారం నుంచి సెప్టెంబర్ 1 వరకు నాలుగు రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ 2 నుంచి యథాతథంగా ఈ టి-9 టికెట్లు కొనసాగుతాయని సజ్జనార్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. టీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు సౌకర్యార్థం టి-9 పేరుతో రెండు టికెట్లను జారీ చేస్తోన్న విషయం తెలిసిందే. అందులో 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణానికి టీ-9-60ని, 30 కిలో మీటర్ల పరిధిలో టీ-9-30ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో టీ-9-60 టికెట్ ధర రూ.100 కాగా, టీ-9-30 టికెట్ ధర రూ.50లు ఉంది. ఈ టీ-9 టికెట్ కు ప్రయాణికుల నుంచి మంచి స్పందనే లభించింది. అలానే రాఖీ పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మరి..టీ-9 టికెట్ ను నిలిపివేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విద్యా దీవెనతో చంద్రబాబు- పవన్ కు మంచి చదువు చెప్పించాలి: రోజా