iDreamPost
android-app
ios-app

గుడ్లపై రంగులు.. తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. కారణమిదే!

  • Published Jun 20, 2023 | 6:33 PM Updated Updated Jun 20, 2023 | 6:33 PM
  • Published Jun 20, 2023 | 6:33 PMUpdated Jun 20, 2023 | 6:33 PM
గుడ్లపై రంగులు.. తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. కారణమిదే!

తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సరఫరా చేసే కోడి గుడ్ల మీద రంగులు వేయాలని నిర్ణయించింది. ఎందుకంటే.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం.. గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా.. అంగన్‌వాడీల్లో పోషకాహార కిట్‌లను అందచేస్తుంది. దాంతో పాటు మధ్యాహ్న భోజనం, కోడి గుడ్లు కూడా అందజేస్తేన్నారు. అయితే అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన గుడ్లు.. దారి మళ్లుతున్నాయంటూ.. ఆరోపణలు వెల్లువత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం అవినీతిని అరికట్టడం కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగాంగా.. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే గుడ్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు.. వాటి మీద రంగుల ముద్రలు వేయాలని నిర్ణయించింది. గుడ్లు పక్కదారి పట్టకుండా ఉండేందుకు.. వాటి మీద జోన్‌ నంబర్‌కు తగ్గట్టుగా గుడ్లకు ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగులు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ఇక మీదట నెలలో మూడు సార్లు.. గుడ్లకు రంగులు వేసి.. వాటిని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఐదు మండలాల్లో.. కాంట్రాక్టర్లకు దీనికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. ప్రతి పది రోజులకు ఒకసారి గుడ్లను సరఫరా చేయాలని.. దానిలో భాగంగా మొదటి దఫా సరఫరా చేసే గుడ్లకు నెమలి నీలం, రెండో దఫా సరఫరా చేసే గుడ్లకు ఎరుపు, మూడో సారి సరఫరా చేసే గుడ్లకు ఆకుపచ్చ రంగు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది గుడ్డు బరువు, ఎత్తు , పొడవుకు సంబంధించి స్పష్టమైన నియమాలను నిర్దేశిస్తుంది.

అగ్మార్క్ నిబంధనల ప్రకారం అంగన్‌వాడీల్లో ఇచ్చే గుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాములు ఉండాలని స్పష్టం చేశారు. 10 గుడ్లను ఒక యూనిట్‌గా పరిగణిస్తే వాటి బరువు 450 గ్రాముల నుంచి 525 గ్రాముల వరకు ఉండాలి. గుడ్డులోని తెల్లసొన పగలకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గుడ్డు 16 మి.మీ వ్యాసం, 3 మి.మీ ఎత్తు ఉండాలని స్పష్టం చేశారు. గుడ్లు సరఫరా చేసే కంపెనీ గోదాముల్లో గుడ్ల నాణ్యత కోసం ల్యాబ్ ఉండాలని సూచించారు. పంపిణీ ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు రిజిస్టర్‌ను నిర్వహించాలని సిఫార్సు చేయబడింది. తక్కువ బరువు, నాణ్యత లేని గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ టెండర్లను రద్దు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం హెచ్చరించింది.