iDreamPost
android-app
ios-app

ఆర్టీసీపై కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం!

ఆర్టీసీపై కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం!

సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం భేటీ అయ్యింది.  డాక్టర్ బీఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో   మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు 5 గంటల పాటు  కేబినెట్ మీటింగ్ కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 8 గంటలకు ముగిసింది. ఇక ఈ సమావేశంలో దాదాపు 40 నుంచి 50 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ సమావేశంలో టీఎస్ ఆర్టీసీపై మంత్రి మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని  మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. విలీనానికి సంబంధించిన విధివిధానాలు నిర్ణయించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇక నుంచి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నారు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనంకి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు. దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 43 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు పొందనున్నారు. ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజారవాణాను పటిష్టపరిచేందుకు  ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆగష్టు 3న  ప్రారంభమయ్యే సమావేశాల్లో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. మరి.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.