iDreamPost
android-app
ios-app

కిమ్ కర్దాషియాన్‌గా కనిపించ‌డానికి ఆమె రూ. 4.8 కోట్లు ఖర్చుచేసింది. ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌లా మార‌డానికి రూ. కోటి ఖ‌ర్చుచేస్తోంది.

  • Published Jul 12, 2022 | 1:23 PM Updated Updated Jul 12, 2022 | 1:23 PM
కిమ్ కర్దాషియాన్‌గా కనిపించ‌డానికి ఆమె రూ. 4.8 కోట్లు ఖర్చుచేసింది. ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌లా మార‌డానికి రూ. కోటి ఖ‌ర్చుచేస్తోంది.

29 ఏళ్ల మోడల్ కు ఫ్యాష‌న్ అంటే మోజు ఎక్కువ‌. కిమ్ కర్దాషియాన్ అంటే విప‌రీతమైన క్రేజ్. అందుకే ఆమెలా క‌నిపించ‌డానికి, 12 ఏళ్ల‌లో 40 కాస్మెటిక్ ఆపరేషన్లు చేయించుకుంది. దాదాపు కిమ్ లా క‌నిపించేది. ఆమె పేరు జెన్నిఫర్ పాంప్లోనా(Jennifer Pamplona). మోడ‌ల్. తనను తాను కిమ్ కర్దాషియాన్( kim kardashian) లాగా మార్చుకోవడానికి దాదాపు $600,000 ఖ‌ర్చుచేసింది. అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో 4.8కోట్లు.

ఇప్పుడు ఆమెలో మార్పు వ‌చ్చింది. ఆమెలా వ‌ద్దు, నాలా ఉండాల‌నుకొంటానంది. అదెలా కుదురుతుంది? రూప‌మే మారిపోయిందిక‌దా! అందుకే త‌న పాత ఫోటోను ముందుపెట్టుకొని, మ‌ళ్లీ త‌న‌లా మారాలనుకుంది. మ‌రో కోటి ఖ‌ర్చుచేసింది.

పెదాల ద‌గ్గ‌ర నుంచి న‌డుం వ‌ర‌కు, ఆమె మొత్తం మీద 40 కాస్మోటిక్ స‌ర్జ‌రీలు చేయించుకుంది. కిమ్ లా మారిపోయింది. జ‌నం కర్దాషియాన్ అని పిలుస్తుంటే ముచ్చ‌ట‌ప‌డింది. రానురానూ అది చికాకులా మారిపోయింది. జెన్నిఫ‌ర్ బాగా చ‌దువుకుంది. బిజినెస్ విమెన్ కూడా. జీవితంలో చాలా సాధించింది. ఇప్పుడు కర్దాషియాన్‌గా కనిపించడం వల్,ల అవ‌న్నీ వెన‌క్కువెళ్లిపోయాయి. ఆమెకంటూ సొంత పేరులేదు, వ్య‌క్తిత్వ‌మూ లేదు. ఇది ఆమెకు న‌చ్చ‌లేదు.

టీనేజ‌ర్ గా ఉన్న‌ప్పుడు కిమ్ అంటే వెర్రెత్తిపోయేది. ఆమె వేసుకున్న డ్రెస్ ల‌ను కొనేది. ఆమెలా బిహేవ్ చేసేది. అదో వ్య‌వ‌స‌నంగా మారిపోయింది. ఎంత‌లా అంటే ఆమెలా మారాల‌నుకొనేటంత‌. మొద‌టి సారి స‌ర్జరీ చేయించుకున్న‌ప్పుడు జెన్నిఫ‌ర్ పాంప్లోనా వయసు, 17 ఏళ్లు. కర్దాషియాన్ లా కాస్త లుక్ మార‌గానే ఆమెకు పాపులారిటీ పెరిగింది. ఇది ఆమెకు బాగా న‌చ్చింది.

పాంప్లోనా తన మొదటి ఆపరేషన్ తర్వాత ఆమె కిమ్ ఆ క‌నిపించాల‌న్న కోరిక‌కు బానిస అయిపోయింది. అక్క‌డ నుంచి మూడు రైనోప్లాస్టీలు( rhinoplasties ) ఎనిమిది బ‌ట్ ఆప‌రేష‌న్లు ఆపరేషన్లు, బట్ ఇంప్లాంట్లు (butt implants) ,కొవ్వు ఇంజెక్షన్లు (fat injections) ఇలా 40 కాస్మోటిక్ స‌ర్జ‌రీలు చేయించుకుంది.

కిమ్ కర్దాషియాన్ లా మారింది. అలాంటి ప్ర‌చారం వ‌చ్చింది. మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ వ‌చ్చారు. కాని ఆనందం మాత్రం రాలేదు. అక్క‌డ నుంచి ఆమెలో ఆలోచ‌న మొద‌లైంది. ఆమె కాస్మిటిక్ స‌ర్జ‌రీల‌కు బానిస అయిపోయింద‌న్న నిజాన్ని గుర్తుప‌ట్టింది. కోరిక‌ల‌మీద ఆమెకు ప‌ట్టుత‌ప్పింది. ఆమె ఒక‌నాటి జెన్నిఫ‌ర్ కాదు. ముఖానికి కొత్త కాస్మొటిక్ ఫేస్ వేసుకొని, వేరొక‌రిలా క‌నిపించే సెల‌బ్రిటీ.

అందుకే బాడీ డిస్మోర్ఫియా( body dysmorphia) అంటే ఎప్పుడూ త‌న శ‌రీరంలోని లోపాల గురించి నెగిటీవ్ గా ఆలోచించే మాన‌సిక వ్యాధి ఉన్నవారికి, సాయం చేయడానికి, మోడల్ బ్రెజిల్‌లో ఫౌండేషన్ ఎర్పాటుచేసింది. త‌నకున్న వ్యాధిని నుంచి బైట‌కొచ్చిన పాంప్లోనా మిగిలిన వారికి ధైర్యం ఇవ్వాల‌నుకొంటోంది. కాని ఇక్క‌డో స‌మ‌స్య ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. అందుకే, ఆమె మ‌ళ్లీ త‌న‌లా మారాలని ట్రైచేస్తోంది.

కాస్మెటిక్ ట్రీట్‌మెంట్‌ల అసహ్యకరమైన వాస్త‌వాల‌ను బైట‌పెట్ట‌డానికి, తాను త‌న‌లా మారిన త‌ర్వాత సెల్ఫీల‌ను షేర్ చేస్తోంది. ఇప్పుడు ఆమె కిమ్ కాదు, జెన్నిఫ‌ర్ పాంప్లోనా . ఆమె డాక్యుమెంట‌రీ కూడా చేసింది.