iDreamPost
android-app
ios-app

Saindhav: సైంధవ్‌ మూవీలోని షాట్‌పై ట్రోల్స్‌.. స్పందించిన డైరెక్టర్‌!

  • Published Jan 04, 2024 | 11:19 AM Updated Updated Jan 04, 2024 | 11:19 AM

సైంధవ్‌ సినిమా ట్రైలర్‌ బుధవారం ఉదయం విడుదల అయింది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే, ట్రైలర్‌లోని ఓ షాట్‌పై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌ మొదలవుతున్నాయి.

సైంధవ్‌ సినిమా ట్రైలర్‌ బుధవారం ఉదయం విడుదల అయింది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే, ట్రైలర్‌లోని ఓ షాట్‌పై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌ మొదలవుతున్నాయి.

  • Published Jan 04, 2024 | 11:19 AMUpdated Jan 04, 2024 | 11:19 AM
Saindhav: సైంధవ్‌ మూవీలోని షాట్‌పై ట్రోల్స్‌.. స్పందించిన డైరెక్టర్‌!

విక్టరీ వెంకటేష్‌-శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన ‘ సైంధవ్‌’ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 13వ తేదీనుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర ట్రైలర్‌ విడుదల అయింది. యూట్యూబ్‌లో విడుదల అయిన ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 2 మిలియన్లకుపైగా వ్యూస్‌ను సంపాదించింది. అయితే, ట్రైలర్‌లోని ఓ షాట్‌పై నిన్నటి నుంచి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌ జరుగుతూ ఉన్నాయి.

హీరో వెంకటేష్‌ ఓ రౌడీ నోట్లో తుపాకి పెట్టి కాలుస్తాడు. తుపాకి గుండు బ్యాక్‌నుంచి బయటకు వస్తుంది. షాట్‌ చాలా క్లియర్‌గా ఉంటుంది. కొంతమంది నెటిజన్లు.. ట్రైలర్‌ ఎంత బాగున్నా పట్టించుకోకుండా.. ఆ షాట్‌పైనే ఫోకస్‌ పెట్టారు. ట్రోలింగ్స్‌ చేస్తూ ఉన్నారు. ఈ ట్రోలింగ్స్‌పై చిత్ర దర్శకుడు శైలేష్‌ కొలను స్పందించారు. ఆ షాట్‌ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లేన్‌ చేశారు. ఏ యాంగిల్‌లో.. ఏవిధంగా కాలిస్తే.. బుల్లెట్‌ అలా నోట్లోనుంచి వెళ్లి బ్యాక్‌నుంచి వస్తుందో వివరించారు.

sailesh kolanu react on trollings

ఈ మేరకు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ సాధారణంగా మీరు ఎవరినైనా నోట్లో కాలిస్తే.. అది తల వెనుక భాగం నుంచి బయటకు వస్తుంది. కానీ, ఓ వ్యక్తిని మీరు ఓ ప్రత్యేక పొజిషన్‌లో కూర్చోబెట్టి.. అతడి నోట్లోకి బ్యారెల్‌ గన్‌ను జొప్పించి.. గన్‌ను 80 డిగ్రీలు కిందకు పెట్టి కాలిస్తే.. బుల్లెట్‌ కడుపులోంచి ఆ విధంగా బయటకు వస్తుంది. మీరు పెట్టిన వీడియోలో ప్రకారం చెప్పాలంటే.. అలా కాలిస్తే.. కడుపును చీలుస్తుంది. అలా కూడా పేగుల్లోంచి దూరి బ్యాక్‌ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా మీరు కాల్చాలంటే.. దానికి చాలా ప్రాక్టీస్‌.. అనుభవం కావాలి. మాస్‌ మూమెంట్‌ క్రియేట్‌ చేయడానికి అలా చేశాం’’ అని చెప్పుకొచ్చారు.

కాగా, సైంధవ్‌ సినిమాలో రుహానీ శర్మ, ఆర్య, నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మయ్యా తదితరులు నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. సినిమా తండ్రీ కూతుళ్ల ప్రేమ ప్రధానంగా నడవనుంది. కూతురి కోసం అండర్‌ వరల్డ్‌ను వదిలేసిన ఓ వ్యక్తి.. మళ్లీ కూతురి కోసం ఆ చీకటి దందాలోకి వెళితే.. ఎలా ఉంటుంది అన్నదే కథగా తెలుస్తోంది. వెంకటేష్‌ రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన వచ్చింది. వెంకీ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు మూవీ విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. మరి, జర్నీ ఆఫ్‌ బుల్లెట్‌ ట్రోలింగ్స్‌పై డైరెక్టర్‌ శైలేష్‌ కొలను స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet