Chiranjeevi
పాన్ ఇండియా సినిమా అంటే అందరికీ నప్పే కథ కావాలి. ప్రపంచం అంతా రాజులు..చరిత్ర జానపద కథలు వున్నాయి.
పాన్ ఇండియా సినిమా అంటే అందరికీ నప్పే కథ కావాలి. ప్రపంచం అంతా రాజులు..చరిత్ర జానపద కథలు వున్నాయి.
Chiranjeevi
పాన్ ఇండియా సినిమా అంటే అందరికీ నప్పే కథ కావాలి. ప్రపంచం అంతా రాజులు..చరిత్ర జానపద కథలు వున్నాయి. అందుకే రాజమౌళి మొదటి సారి మగథీర అంటూ పునర్జన్మతో రాజుల కథ తీసుకున్నారు. ఆ తరువాత రాజులు.జానపదం కలిపి కథ అల్లి బాహుబలి సిరీస్ తీసారు. ఆ తరువాత చరిత్రకు కాల్పనిక సంఘటనలు ముడిపెట్టి ఆర్ఆర్ఆర్ తీసారు. ఇక మిగిలింది మైథలాజికల్ మూవీ. వారణాసి అంటూ అటు వెళ్లారు.
నిజానికి రాజమౌళి వారణాసి అనుకోక ముందు నుంచే త్రివిక్రమ్ మదిలో మైథలాజికల్ పాన్ ఇండియా స్టోరీ ఐడియా వుంది. కానీ ఎందుకో ఆలస్యం చేసారు. అనుకున్న తరువాత బన్నీ దగ్గరకు వెళ్లి రావడం, ఎన్టీఆర్ దగ్గర ఆగడం ఇవన్నీ కలిసి మరింత లేటు అయింది. ఈ లోగా రాజమౌళి వారణాసి మీదకు వచ్చేసారు. బాలీవుడ్ లో ఏకంగా రామాయణం మీదకు వచ్చారు.
అయితే త్రివిక్రమ్ కు లేట్ అయినా చాలా పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు మురుగన్/కుమారస్వామి కథ ఎవరూ ఇంత పెద్ద స్కేల్ లో ఎవరూ టచ్ చేయలేదు. పైగా మురుగన్/కుమారస్వామి అంటే హిందూ సమాజంలో తెలియని వారు లేరు. భక్తులు కాని వారు లేవు. సినిమాల లెక్కల్లో చూసుకోవాలి అంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, ప్రాంతాలతో పాటు మలేషియా, దుబాయ్ ఇలా ప్రతి చోట్లా సినిమా పుల్లింగ్ కు సరిపడా ఆడియన్స్ వున్నారు.
అది పెద్ద అడ్వాంటేజ్. సినిమా ఎలా వచ్చినా, ఎలా వున్నా, త్రివిక్రమ్-ఎన్టీఆర్-మురుగన్ కథ అనే ఒక్క ఫ్యాక్టర్ చాలు. జనం కచ్చితంగా సినిమా చూడడానికి. అది చాలు సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి. పైగా ఈ ఆడియన్స్ రేంజ్ తెలిసిన ఓటిటి సంస్థలు కూడా పెద్ద మొత్తం ఆఫర్ చేస్తాయి. అందువల్ల అన్ని విధాలా త్రివిక్రమ్ పాన్ ఇండియా ఎంట్రీకి ఇది సరైన ప్రాజెక్ట్ అనే చెప్పాలి.