iDreamPost
android-app
ios-app

జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్

  • Published Jan 31, 2020 | 3:37 PM Updated Updated Jan 31, 2020 | 3:37 PM
  • Published Jan 31, 2020 | 3:37 PMUpdated Jan 31, 2020 | 3:37 PM
జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్

మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కి  చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీ లీజులు ప్రభుత్వం రద్దు చేసింది. అనంతపురము జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిషూల్ సిమెంట్ కంపెనీకి ఇచ్చిన లీజుల్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యాడికి లోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే నెంబరు 22 బిలో ఉన్న 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజుల్ని రద్దు చేసింది. సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.

ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగూ పడనందునే ఈ రద్దు ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కోన్నది. లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం , రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని పేర్కొంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetmatbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio