iDreamPost
android-app
ios-app

మరోసారి రవి తెలుగు ట్రావెలర్‌పై నా అన్వేష్‌ బూతు పురాణం!

  • Published Sep 13, 2023 | 3:45 PM Updated Updated Sep 13, 2023 | 3:45 PM
  • Published Sep 13, 2023 | 3:45 PMUpdated Sep 13, 2023 | 3:45 PM
మరోసారి రవి తెలుగు ట్రావెలర్‌పై నా అన్వేష్‌ బూతు పురాణం!

ప్రముఖ తెలుగు ట్రావెలర్స్‌ నా అన్వేష్‌.. రవి తెలుగు ట్రావెలర్‌ల మధ్య గత కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి మధ్య పోటాపోటీగా గొడవలు జరిగాయి. యూట్యూబ్‌లో పోటీ పడి మరి తిట్టుకుంటూ వీడియోలు పెట్టుకున్నారు. అయితే, సంవత్సరంన్నర నుంచి ఇద్దరూ సైలెంట్‌ అయ్యారు. ఇంతకాలం తర్వాత మళ్లీ ఇద్దరి మధ్యా గొడవలు మొదలైనట్లు కనిపిస్తోంది. తాజాగా, యూట్యూబర్‌ నా అన్వేష్‌.. రవి తెలుగు ట్రావెలర్‌ను తిడుతూ ఓ వీడియోను తన యూట్యూబ్‌లో ఖాతాలో విడుదల చేశాడు. ఆ వీడియోలో ఈ విధంగా ఉంది..

‘‘ రవి తెలుగు ట్రావెలర్‌ చాలా ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లాడు. అక్కడ బాగా ఎంజాయ్‌ చేశాడు. ఇప్పుడు అమెరికా పాస్‌పోర్టుతో ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు. భారతీయుడ్ని అని చెప్పుకుంటున్నాడు. ఇండియా పాస్‌పోర్టుతో తిరిగితేనే అర్థం. గతంలో మీడియా సమావేశం పెట్టి ‘ నేను ఓ ఎన్‌ఆర్‌ఐని. నాకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఖర్చు పెడతా’ అని చెప్పాడు. ఎక్కడ ఇచ్చాడు. యూట్యూబ్‌లో వచ్చిన డబ్బులు ఇవ్వకపోగా.. ఆ డబ్బుల్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టుకుని తిరుగుతున్నాడు. సిగ్గు, లజ్జ లేదు. నేను అతడ్ని నిగ్గదీయటం వల్ల అతడిపై జనం ఓ ముద్ర వేశారు. ఇప్పుడు మళ్లీ మీడియా చుట్టూ తిరుగుతున్నాడు.

ఇతడికి ఏలిన నాటి శని పట్టింది. ఇతడు ఎక్కడికి వెళితే అక్కడ దరిద్రం. డబ్బులు ఇచ్చి మరీ మీడియా ఛానళ్లకు వెళుతున్నాడు. నా పని నేను చేసుకుంటున్నాను. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నాడు. నువ్వు ట్రావెలర్‌వి కాదు. నీకు నాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయనకు 50 ఏళ్లు ఉన్నాయి. భార్య డబ్బులతో దేశాలు తిరుగుతున్నాడు. సినిమా రివ్వ్యూలు కూడా ఎవరో చెప్పినవి పోస్టు చేసుకుంటాడు. నా శ్రేయోభిలాషులు చెప్పారని నేను అతడి జోలికి వెళ్లటం మానేశా. మళ్లీ ప్రొవోక్‌ చేస్తున్నాడు’’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మరి, నా అన్వేష్‌.. రవిపై ఈ విధంగా కామెంట్లు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş