iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో నడి రోడ్డుపై ఘోరం.. యువతి కాలేజీకి వెళ్తుండగా..!

  • Published Aug 03, 2023 | 4:02 PM Updated Updated Aug 03, 2023 | 4:02 PM
  • Published Aug 03, 2023 | 4:02 PMUpdated Aug 03, 2023 | 4:02 PM
హైదరాబాద్ లో నడి రోడ్డుపై ఘోరం.. యువతి కాలేజీకి వెళ్తుండగా..!

ఈమె పేరు వైష్ణవి, వయసు కూడా చాలా చిన్నదే. హైదరాబాద్ లోని బోయినపల్లిలోని ఓ ప్రాంతంలో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటూ స్థానికంగా ఓ కాలేజీలో చదువుకుంటుంది. అయితే, గురువారం ఆ యువతి ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లేందుకు స్కూటీపై బయలు దేరింది. ఈమెతో పాటు ఆ అమ్మాయి తండ్రి కూడా ఆమె స్కూటీకి ఎక్కాడు. అలా తండ్రీకూతురు ఇద్దరు కలిసి కానాజీగూడ నుంచి బోయిన్ పల్లి వైపు వెళ్లగానే మార్గమధ్యలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చేసుకుంది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తండ్రి ముందే ఆ యువతికి ఇలా జరగడంతో అంతా షాక్ గురవుతున్నారు. అసలేం జరిగిందంటే?

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బోయిన్ పల్లిలోని కానాజీగూడలో వైష్ణవి అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మాయి స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో చదువుకుంటోంది. ఇక రోజు లాగే వైష్ణవి బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లాలనుకుంది. కాగా, ఆమె తండ్రి విజయ్ కుమార్ స్కూటీ మీద ఏదో పని మీద బయటకు వెళ్తున్నాడు. దీంతో వైష్ణవిని ఆమె తండ్రి కూడా స్కూటీ మీద ఎక్కించుకున్నాడు. అలా ఇద్దరు కానాజీగూడ నుంచి బోయిన్ పల్లికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వీరి వాహనం ఓ హోటల్ వద్దకు రాగానే వైష్ణవి ఆ స్కూటీ నుంచి ఎగిరి కిందపడింది.

ఇదే సమయంలో వెనకాల నుంచి వేగంగా వచ్చిన డీసీఎం ఆ యువతిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వైష్ణవితో పాటు ఆమె తండ్రి విజయ్ కుమార్ గాయపడ్డారు. కానీ, వైష్ణవికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు. ఇక ఫలితం లేకపోవడంతో వైష్ణవి చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వైష్ణవి మృతి చెందడంతో కానాజీగూడలో విషాద ఛాయలు అలుమకున్నాయి.

ఇది కూడా చదవండి: పాపం.. భర్త కోరిక ఆ మహిళ కొంప ముంచింది!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom