iDreamPost
android-app
ios-app

ఫుడ్ డెలివరీ ఏజెంట్ ను కొట్టిన పోలీస్.. వెంటనే ట్రాన్స్ఫర్ చేసిన ఉన్నతాధికారులు

  • Published Jun 05, 2022 | 5:49 PM Updated Updated Jun 05, 2022 | 5:49 PM
  • Published Jun 05, 2022 | 5:49 PMUpdated Jun 05, 2022 | 5:49 PM
ఫుడ్ డెలివరీ ఏజెంట్ ను కొట్టిన పోలీస్.. వెంటనే ట్రాన్స్ఫర్ చేసిన ఉన్నతాధికారులు

రద్దీగా ఉన్న రోడ్డుపై అందదరూ చూస్తుండగా ఫుడ్ డెలివరీ ఏజెంట్ పై చేయి చేసుకున్నాడో ట్రాఫిక్ పోలీస్. ఫలితంగా ఆ పోలీస్ ను పోలీస్ కంట్రోల్ రూమ్ కు ట్రాన్స్ఫర్ చేశారు ఉన్నతాధికారులు. తమిళనాడులోని సింగనల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. సింగనల్లూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన గ్రేడ్ 1 కానిస్టేబుల్ సతీశ్ అవినాశి రోడ్ లోని ట్రాఫిక్ జంక్షన్ వద్ద డెలివరీ పర్సన్ ను చెంపదెబ్బ కొట్టాడు.

ప్రముఖ ఫుడ్ అగ్రిగేటర్ అయిన స్విగ్గీలో మోహన సుందరం (38) అనే వ్యక్తి రెండేళ్లుగా డెలివరీ పార్టనర్ గా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ ర్యాష్ గా, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ బస్సు ఇద్దరు టూవీలర్స్ ను, పాదచారుడిని ఢీకొట్టబోయింది. డ్రైవర్ ను ఎందుకిలా జరిగిందని నిలదీయగా.. ట్రాఫిక్ జామ్ కారణంగా ఇలా అయిందని చెప్పాడు. పోలీస్ ఫుడ్ డెలివరీ వ్యక్తిని తిడుతూ.. చెంపదెబ్బ కొట్టాడు. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాక్కున్నాడు. మోటార్ సైకిల్ ను కూడా డ్యామేజ్ చేశాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూసిన పోలీసు ఉన్నతాధికారులు సతీష్ ను కోయంబత్తూర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

 

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabetEscortes Belgique