iDreamPost
android-app
ios-app

దంపతుల ప్రాణాలు తీసిన బోరు మోటారు! ఏం జరిగిందంటే..

దంపతుల ప్రాణాలు తీసిన బోరు మోటారు! ఏం జరిగిందంటే..

మృత్యువు అనేది ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందే ఎవ్వరం చెప్పలేము. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వారు.. క్షణం తరువాత విగతజీవులుగా మారుతున్నారు. ఇలా అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాల్లో విషాదాలు  చోటు చేసుకుంటాయి. తాజాగా హైదరాబాదా లో ఓ విషాదం చోటుచేసుకుంది. ఓ బోరు మోటర్ భార్యాభర్తల ప్రాణాలు తీసింది. కొత్త ఇంటి గోడలకు నీరు కొట్టే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా ఉమర్‌గావ్‌ మండలం తిర్కోలికి చెందిన తన్వీర్‌ మాడ్జే (34) సివిల్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య షాకెరా మాడ్జే (32) కొడుకు మయూర్‌ మాడ్జే (11), కుమార్తెలు జోయా మాడ్జే (9), మహీమ్‌ మాడ్జే(7) లతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం కుటుంబంతో సహా తన్వీర్  హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడే సొంతిళ్లు కట్టుకోవాలని తన్వీర్ భావించాడు. ఈ క్రమంలోనే పాతబస్తీలోని గౌస్‌నగర్‌ ప్రాంతంలో ప్లాటు కొనుగోలు చేశాడు.

అంతేకాక ఇంటి నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టాడు. నిర్మాణంలో ఉన్న ఇంటి కింది భాగంలో గోడలు కట్టి తాత్కాలికంగా నిర్మించిన గదిలో నివాసం ఉంటున్నాడు.  మొదటి అంతస్తులో నిర్మించిన గదిలో తన్వీర్ బాబాయి కొడుకు జమీర్ ఉంటున్నాడు. రోజూ కొత్తింటికి నీరు పెడుతూ ఉండే వారు. అలానే శనివారం తెల్లవారుజాము 5 గంటలకు కూడా తన్వీర్‌.. కొత్తింటి గోడలకు నీరు పట్టడం కోసం సంపులో నీటిని నింపాలని అనుకున్నాడు. బోరు మోటారు స్విచ్‌ ఆన్‌ చేసి సంపులో నీటి మట్టం చూసేందుకు వెళ్లాడు. అయితే  అక్కడే ఉన్న కరెంట్ తీగ కట్ అయి సంపుపై ఉన్న ఐరన్ మూతపై పడింది.

అది గమనించని తన్వీర్‌ దానిపై కాలు పెట్టగానే విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అంతలోనే అక్కడకు వచ్చిన భార్య షాకెరా.. భర్తను ఆ స్థితిలో చూసి కంగారు పడింది. ఏమీ తోచక కంగారులో ఆమె కూడా భర్త చేతిని పట్టుకుంది. దీంతో ఆమెకు సైతం విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ దంపతుల బిడ్డలు నిద్రలేచి చూడగా తల్లిదండ్రులు.. అచేతనంగా పడి ఉండటాన్ని గమనించారు. అనంతరం వారి మృతదేహాలపై  పడి రోధించారు. ఆ దంపతుల అకాల మరణంతో వారి బిడ్డలు అనాథలు గా మారారు. మరి.. ఇలాంటి విషాద ఘటనల నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet