iDreamPost
android-app
ios-app

పెళ్లి ఇంట్లో విషాదం..పీటలెక్కాల్సిన వరుడి మృతి!

పెళ్లి ఇంట్లో విషాదం..పీటలెక్కాల్సిన వరుడి మృతి!

తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్క యువత కోరుకుంటుంది. అలానే ఎందరో తమ పెళ్లిళ్లను ఎంతో ఘనంగా, అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే కొన్ని పెళ్లి వేడుకల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాళ్ల పారణి ఆరక ముందే కొందరు నూతన వధువరులు తిరిగి రాని లోకాలకు వెళ్తున్నారు. తాజాగా ఓ  పెళ్లి ఇంట కూడా విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన కుమురం భీమ్ జిల్లాలో  చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

అసిఫాబాద్ కుమురం భీం జిల్లా కౌటాల మండలం గుడ్ల బొరీ గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య యశోద దంపతుల ముగ్గురు కొడుకులు. వీరిలో పెద్ద కుమారుడు తిరుపతి (26)కి ఇటీవల మంచిర్యాల జిల్లా భీమిని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది.  మరోవైపు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలోనే పెళ్లి పనుల్లో నిమగ్నమైన కాబోయే పెళ్లి కుమారుడు.. సోమవారం వడదెబ్బకు గురయ్యాడు. కాబోయే వరుడికి వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డాడు. తిరుపతిన పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు కాగజ్‌నగర్‌ తీసుకెళ్ళి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి తిరుపతి ఆరోగ్య పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తిరుపతి మృతి చెందాడు. వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న వ్యక్తి ఇలా ఉన్నట్టుండి మరణించడంతో  స్థానికంగా విషాదం నెలకొంది. తిరుపతి సోదరుడు శ్రీనివాస్ కూడా  గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతూ అరు నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందాడు. పెళ్లి కోసం ముస్తాబు చేసిన ఇంటి ముందు మృతదేహం పెట్టాల్సి రావడంపై బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.