iDreamPost
android-app
ios-app

పెళ్లి పెద్దగా మారిన భర్త.. భార్యకు ప్రియుడితో వివాహం!

పెళ్లి పెద్దగా మారిన భర్త.. భార్యకు ప్రియుడితో వివాహం!

ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు, భర్తను వదిలేసి లేచిపోవడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పరాయి వారితో పడక సుఖం కోసం  అడ్డదారులు తొక్కుతున్నారు. ఇక ఇష్టం లేకుండా  పెళ్లి చేసుకుని.. సంసారాన్ని కష్టంగా సాగిస్తున్నా వారూ ఉన్నారు. మరికొందరు అయితే ఒక వ్యక్తిని ఇష్ట పడి.. పెద్దల మాట కాదన లేక మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు.  ఆ తరువాత కూడా ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక పోతుంటారు. భార్య ప్రియుడి గురించి ఆలోచిస్తున్న తెలిసిన చాలా మంది భర్తలు.. వారిని వేధింపులకు గురిచేస్తుంటారు. కానీ ఓ భర్త.. మాత్రం తన భార్య మనస్సును అర్ధం చేసుకుని ప్రియుడితో కలిపాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర్​ప్రదేశ్​లోని మీర్జాపుర్ జిల్లాలోని అమోయి పూర్వ అనే  గ్రామానికి చెందిన దినేశ్ అనే వ్యక్తి.. గులాబి అనే యువతితో  ఏడాది క్రితం వివాహం జరిగింది. వీరికి పెళ్లి జరిగిందనే కానీ… ఏనాడు భార్యాభర్తల సంసారం చేయలేదు. అతడు గులాబి దగ్గరికి వెళ్లిన.. ఆమె దూరం పెట్టేది. ఇదే సమయంలో పక్కింట్లో నివాసం ఉండే రాహుల్​ అనే యువకుడితో గులాబి ప్రేమలో పడింది. భర్త అతనితో తరచుగా ఫోన్​ మాట్లాడుతూ ఉండేది. ఇలా వారిద్దరి మధ్య చాలా కాలం పాటు ఫోన్ లో సంభాషణలు నడిచాయి. తనను దూరం పెడుతున్న భార్యపై అనుమానంతో.. ఆమెను గమనిస్తూ ఉన్నాడు.

రెండు రోజుల క్రితం రాహుల్ తో తన భార్య ఫోన్ మాట్లాడటం దినేశ్ గమనించాడు. అందరి భర్తలా ఆవేశ పడిపోకుండా ఆమె మనసును అర్థం చేసుకున్నాడు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించి.. వారిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల వారిని ఒప్పించాడు. అనంతరం అందరి సమ్మతితో.. గుడిలో వివాహం జరిపించాడు. గురువారం సాయంత్రం గుడిలో రాహుల్, గులాబిల పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ పెళ్లి చుట్టుపక్క గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీకాంత్ హీరోగా నటించిన కన్యాదానం సినిమా రియల్ గా చూసినట్లు ఉందని ఈ ఘటన తెలిసిన వారు అభిప్రాయ పడుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet