iDreamPost
android-app
ios-app

ప్రధాని పేరు చెప్పలేకపోయాడని పెళ్లి రద్దు! ఆపై వరుడి తమ్ముడితో

ప్రధాని పేరు చెప్పలేకపోయాడని పెళ్లి రద్దు! ఆపై వరుడి తమ్ముడితో

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి  అనేది మధురమైన వేడుక. అందుకే ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని భావిస్తుంటారు. అలానే యువతి యువకులు.. తమను పెళ్లిచేసుకునే వారు అందంగా ఉండాలని ఎన్నో కలలు కంటారు. ముఖ్యంగా కొందరు అమ్మాయిలు అయితే మహేష్ బాబులాంటి ముఖం, ఐదంకెల జీతం ఇంకా ఎన్నో కోరికలతో ఉంటారు. అందుకే బట్టతల ఉందని, నల్లగా ఉన్నాడని కొందరు అమ్మాయిలు పెళ్లిని రద్దు చేసుకున్న ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ప్రధాని ఎవరో చెప్పలేదని చేసుకున్న వివాహాన్ని  ఓ వధువు రద్దు చేసుకుంది.  ఆ తరువాత వరుడి తమ్ముడిని వివాహం చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్‌ జిల్లాలో ఓ ప్రాంతంలో శివశంకర్(27) అనే వ్యక్తి.. తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి అనంత్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. స్థానికంగా  పని చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా తోడుగా ఉంటున్నాడు. శివశంకర్ కు ఆరు నెలల క్రితం రంజన అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలోనే జూన్ 11న వీరిద్దరి వివాహం జరిగింది. అందమైన భార్య దొరకడంతో శివశంకర్ ఎంతో సంతోషంలో మునిగిపోయాడు. అయితే ప్రధాని పేరు.. తన పెళ్లిని పెట్టాకులు  చేస్తుందని అసలు ఊహించలేదు. పెళ్లి జరిగిన మరుసటి రోజు అంటే.. జూన్ 12 ఉదయం.. శివశంకర్.. తన మరదలు, బావమరిదితో కలసి సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో శివశంకర్‌ తన మరదలు, బావమరిదితో సరదాగా మాటలు కలిపాడు.

ఉన్నట్టుండి దేశ ప్రధాని ఎవరు బావా? అంటూ మరదలు వేసిన ప్రశ్నకు శివశంకర్‌ సమాధానం చెప్పలేకపోయాడు. ఇది చూసిన పెళ్లి కూతురి బంధువులు వరుడిని ఎగతాలి చేశారు. బంధువుల మాటలను తీవ్ర అవమానంగా భావించిన వధువు.. శివశంకర్‌ తో జరిగిన పెళ్లిని రద్దు చేసుకుంది. వెంటనే శివశంకర్ తమ్ముడైన అనంత్‌ను అక్కడికక్కడే మరో పెళ్లి చేసుకుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. అనంత్ ప్రధాని పేరు చెప్పడంతోనే పెళ్లి చేసుకుందని సమాచారం. వధువు రంజన కంటే అనంత్‌ వయసులో చిన్నవాడు. ఏది ఏమైనా ప్రధాని పేరు ఓ యువకుడి పెళ్లిని పెట్టాకులు చేసింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom