iDreamPost
android-app
ios-app

ఆయనకు 60.. ఆమెకు 30..ఓకే కాన్పులో ముగ్గురు!

ఆయనకు 60.. ఆమెకు 30..ఓకే కాన్పులో ముగ్గురు!

సమాజంలో జరుగుతున్న ఘటనలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. బామ్మ వయస్సు వాళ్లు తల్లి కావడం, మగవారు బిడ్డలకు జన్మనివ్వడం వంటి ఆశ్చర్య ఘటనలు జరుగుతుంటాయి. అలానే తాజాగా 62 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి.. ఒకే సారి ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆయన భార్య వయస్సు కేవలం 30 ఏళ్లు మాత్రమే. ఈ విచిత్ర జంటకు ఓకే కాన్పులో ముగ్గురు బిడ్డలు జన్మించారు.  ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా ఉచెహ్రా మండలం అతర్వేదియా ఖుర్ద్‌ గ్రామానికి చెందిన గోవింద్‌ కుష్వాహా (62) హీరాబాయి కుష్వాహా (30) భార్యాభర్తలు. గోవింద్ ,హీరాబాయి కుష్వాహాను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె ఇటీవలే గర్భవతి అని తెలింది. దీంతో తరచూ ఆస్పత్రికి వెళ్లి… వైద్య పరీక్షలు చేయించుకుని వస్తుండే వారు. సోమవారం రాత్రి హీరాబాయికి పురిటి నొప్పులు రావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం  వైద్యులు ఆపరేషన్ చేయగా.. ఆమె ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.

ఆ పిల్లలు కాస్త అనారోగ్యంగా ఉండటంతో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గోవింద్‌ మొదటి భార్య పేరు కస్తూరిబాయి. ఆమె వయసు 60 ఏళ్లు. ఈ దంపతుల  18 ఏళ్ల కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇంటికి వారసుడు లేడని ఆ దంపతులు బాధ పడ్డారు. ఈ క్రమంలోనే కస్తూరిబాయే దగ్గరుండి మరీ తన భర్తకు రెండో పెళ్లి జరిపించింది. పెళ్లయిన ఆరేళ్లకు హీరాబాయి ముగ్గురు బిడ్డలు పుట్టడంతో వీరి ముచ్చట తీర్చింది. మరి..  ఈ విచిత్ర ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.