iDreamPost
android-app
ios-app

పడక సుఖం కోసం బిడ్డను కడతేర్చిన కసాయి తల్లి!

పడక సుఖం  కోసం బిడ్డను కడతేర్చిన కసాయి తల్లి!

ఇటీవల కాలంలో వివాహేతర  సంబంధం కారణంగా జరుగుతున్న నేరాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఈ అక్రమం సంబంధాల కారణంగా పచ్చని సంసారాలు నిట్టనిలువును చీలిపోతున్నాయి. పరాయి వారితో పడక సుఖం కోసం భాగస్వామిని మోసం చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే తమ అక్రమ సంబంధాన్ని అడ్డుగా ఉన్నారని   కొందరు మహిళలు భర్తలను దారుణంగా హత్య చేస్తున్నారు. ఇంకొందరు పరాయి వారితో శారీరక సుఖంగా అడ్డుగా ఉన్నారని కన్న బిడ్డలను సైతం హతమారుస్తున్నారు. తాజాగా అలాంటి ఘోరమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపంలోని కొరుక్కంబాక్కం అనే గ్రామానికి చెందిన సెల్వప్రకాష్‌కు లావణ్య అనే యువతితో వివాహం జరిగింది. వీరికి సర్వేశ్వరన్ అనే రెండున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. పెళ్లైన కొంతకాలం పాటు బాగానే ఉన్న ఈ దంపతులు …  ఆ తరువాత తరచూ గొడవలు పడుతుండే వారు. ఇలా వారి మధ్య ఘర్షణలు జరుగుతుండంతో విడిపోయి వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు  లావణ్య వద్దనే ఉండే వాడు. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం సర్వేశ్వరన్‌ ప్రమాదవశాత్తు కింద మృతి చెందినట్టు లావణ్య ఆస్పత్రికి  తీసుకొచ్చింది. చివరకు అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లి.. భర్తకు చెప్పకుండా  బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. కొన్ని రోజుల తరువాత కుమారుడి మరణ వార్త.. అతడి తండ్రికి తెలిసి షాకయ్యాడు.

తన కుమారుడి మృతిలో అనుమానం ఉన్నట్టు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చివరకు పోస్టుమార్టం నివేదికలో హత్య జరిగినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు లావణ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పోలీసులకు ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. లావణ్యకు అదే ప్రాంతానికి చెందిన మణిగండన్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం వున్నట్టు తేలింది. తమ పడక సుఖానికి అడ్డుగా వున్న సర్వేశ్వరన్‌ను ఇద్దరూ కలిసి హత్య చేసినట్టు ఆ కసాయి తల్లి  ఒప్పుకుంది. లావణ్యతో పాటు ఆమె ప్రియుడు మణిగండన్‌ను అరెస్టు చేశారు. మరి.. ఇలా శారీరక సుఖం కోసం బిడ్డలను హత్య చేస్తున్న ఇలాంటి వారికి ఏ విధమైన శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet