iDreamPost
android-app
ios-app

కాల్చిన కొడవలితో భార్యపై హత్యాయత్నం..

కాల్చిన కొడవలితో భార్యపై హత్యాయత్నం..

భార్యాభర్తల మధ్య గొడవలు అనేది  సాధారణం. ఎందరో దంపతులు తమ మధ్య వచ్చే చిన్న పాటి గొడవలకు సర్థుకు పోతూ.. సంసార జీవితంలో సాగిపోతుంటారు. అయితే నేటికాలంలో దంపతుల మధ్య అహం అనేది పెరిగి  పోయింది. తాము ఎవరి కంటే తక్కువ కాదు, ఎవరిపై ఆధారపడాల్సి అవసరం లేదనే భావనలో  నేటితరం దంపతులు ఉన్నారు. అందుకే ఘర్షణలు జరిగి.. చివరకు విడాకులు, హత్యల వరకు వెళ్తున్నారు. తాజాగా ఓ భర్త.. కాల్చిన కొడవలితో భార్యపై హత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆమె చావుబతుకల మధ్య ఉంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒగ్గు నిర్మల(35), మల్లేశ్‌ దంపతుల నివాసం ఉంటున్నారు.  మల్లేశ్ హమాలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.  ఈ దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. హమాలీ పని చేస్తున్న మలేశ్.. వచ్చిన సంపాదనతో మద్యం తాగి రోజు ఇంటికి వెళ్లే వాడు. అంతేకాక  మద్యం మత్తులో రోజు భార్యతో గొడవ పెట్టుకుని కొడుతున్నాడు. ఈ క్రమంలోనే భార్యపై బాగా కోపం పెంచుకున్న మల్లేశ్.. చంపేందుకు పథకం వేశాడు. అందులో భాగంగా.. బుధవారం ఉదయం బయటకు వెళ్లి ఇంటి కొచ్చిన మల్లేశ్‌.. కొడవలిని కాల్చి పెట్టుకున్నాడు. పిల్లలు పాఠశాలకు వెళ్లిన అనంతరం నిర్మల ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన మల్లేశ్‌.. అప్పటికే సిద్ధం చేసుకున్న కాల్చిన కొడవలితో నిర్మల మెడ వెనుక పొడిచాడు.

ఈ హఠాత్పరిణామంతో నిర్మలా గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగు నిర్మలా వాళ్ల ఇంటికి వచ్చారు. స్థానికలును చూసి  మల్లేశ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నిర్మలను కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స చేసి కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాల్చిన కొడవలి కావడంతో శరీరం లోపలి భాగాలకు తీవ్ర గాయాలు అయ్యి ఉండొచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. కొడవలిని మెడ నుంచి వేరు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు మల్లేశ్‌.. పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మరి.. ఇలాంటి దారుణల నివారణకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom