iDreamPost
android-app
ios-app

నగరంలో వ్యభిచారం.. 26 మంది యువతుల అరెస్ట్!

నగరంలో వ్యభిచారం.. 26 మంది యువతుల అరెస్ట్!

అడ్డదారుల్లో సొమ్మును సంపాదించే వారి సంఖ్య రోజు రోజూకు పెరిగి పోతుంది. కష్టపడి సంపాదించడం చేత కాక వివిధ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే మహిళలకు,యువతులకు డబ్బులు ఎరగా చూపి వ్యభిచారాలు చేయిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఇలాంటి వారిపై తరచూ పోలీసులు దాడులు చేసి అరెస్టుల సైతం చేస్తున్నారు. అయినా కుక్కతోక వక్కరే అన్నట్లు కొందరు.. వ్యభిచారన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని పలు  ప్రాంతాల్లో దాడులు చేసి వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. ఈ దాడులో 26 మంది మహిళలను అరెస్ట చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని పలు ప్రాంతాల్లోని బార్లు, పబ్ లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్లలో గల బార్లు, పబ్‌లపై శనివారం అర్ధరాత్రి సిటీ సెంట్రల్ పోలీసులు దాడులు జరిపి అనైతిక కార్యకలాపాల్లో నిమగ్నమైన 26 మందికి పైగా ఆఫ్రికన్ల మహిళలను అరెస్ట్‌ చేశారు. వ్యభిచారం, డ్రగ్స్‌ సరఫరాతో పాటు ఇతర అనైతిక కార్యకలాపాల్లో నిమగ్నమైన మహిళలను, పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, పురుషులతో కలిపి 26 మందికి పైగా ఆఫ్రికన్లకు డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించారు.

పరీక్షల్లో వీరందరూ మాదక ద్రవ్యాలు సేవించినట్లు వెల్లడైంది. ఇక దారుణం ఏమిటంటే పోలీసులు దాడులు చేస్తున్న సమయంలో కూడా డ్రగ్స్ మత్తులో యువతులు గొడవకు దిగారు. మరికొందరు అక్కడి నుంచి పారిపోయేందుకు పరుగులు తీశారు. ఒక యువకుడు కూడా పరారు కాగా వెంబడించి మరీ పోలీసులు అతడిని పట్టుకున్నారు. పోలీసులకు పట్టుబడిన అందరినీ బౌరింగ్‌ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆఫ్రికన్లు, ఇతర విదేశీయులు డ్రగ్స్‌ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో రుజువైంది.

దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చెపట్టారు. అరెస్టన వారి పాస్‌పోర్ట్‌, వీసా తీసుకురావాలని వారి సంబంధిత వ్యక్తులకు పోలీసులు సూచించారు. ఎవరూ తీసుక రాకపోవడంతో డ్రగ్స్‌ కేసుతో పాటు అక్రమ వలస కేసులు నమోదు చేశారు. పోలీసుల తనిఖీల్లో ఎక్కడ డ్రగ్స్ దొరకలేదు. దీంతో ఎక్కడి నుంచి డ్రగ్స్‌ తెచ్చుకున్నారు అనేదానిపై విచారిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.