iDreamPost
android-app
ios-app

ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నారా? ఇతని కథ అందరికీ గుణపాఠం!

  • Published Jun 20, 2024 | 6:15 PM Updated Updated Jun 20, 2024 | 6:15 PM

ఈ మధ్య కాలంలో రీల్స్ పిచ్చిలో పడి చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు చాలానే వింటున్నాం. ఈ క్రమంలోనే రీల్స్ పిచ్చి ఉండి సాహసం చేసేవారికి తాజాగా ఓ యువకుడు చేసిన ఘటన వార్నింగ్ లా మారింది.

ఈ మధ్య కాలంలో రీల్స్ పిచ్చిలో పడి చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు చాలానే వింటున్నాం. ఈ క్రమంలోనే రీల్స్ పిచ్చి ఉండి సాహసం చేసేవారికి తాజాగా ఓ యువకుడు చేసిన ఘటన వార్నింగ్ లా మారింది.

  • Published Jun 20, 2024 | 6:15 PMUpdated Jun 20, 2024 | 6:15 PM
ఇన్‌స్టా  రీల్స్ చేస్తున్నారా? ఇతని కథ అందరికీ గుణపాఠం!

ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ అనేది ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈ రీల్స్ పిచ్చిలోనే బతుకుతున్నారు. ఈ క్రమంలోననే అందరూ ఈ రీల్స్ పిచ్చిలో పడిపోయి ఫోన్  కు అడిక్ట్ అవుతూ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మార్చిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే..ఈ ప్రపంచాన్నే మార్చిపోయే స్థితిలో ఉంటున్నారు.  ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒంటి మీద సోయా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఉండటం వలనే కొన్ని సార్లు ప్రాణాలు పోయే ఘటనలు కూడా జరుగుతున్నాయి.

ముఖ్యంగా యూత్ అయితే ఈ రీల్స్ యుగంలో.. విపరీతమైన క్రేజ్, భారీ ఫాలోవర్స్, లక్షకొలది లైక్స్ రావడం కోసం కొంతమంది ఏకంగా ప్రాణాలను కూడా రిస్క్ చేస్తున్నారు. మరి కొంతమంది విచిత్రమైన ఆలోచనలతో ఎవ్వరూ ఊహించని పనులు చేస్తూ.. ప్రాణాలనే పొగొట్టుకుంటారు. కాగా, ఇప్పటికే సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను పొగొట్టుకునే ఘటనలు చాలానే వింటున్నాం. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు రీల్స్ పిచ్చితో తాను చేసిన పిచ్చి పనికి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు ఇంతకి ఏం జరిగిందంటే..

వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా నర్సంపేటలో అజయ్ అనే 23 ఏళ్లు యువకుడు.. ఇన్‌స్టాగ్రాంలో తరచూ రీల్స్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు వినూత్న పద్ధతిలో రీల్స్ చేసి.. లక్షల్లో వ్యూస్, లైక్స్ తెచ్చుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోదామని రకరకాల ప్రయత్నాలు చేసేవాడు. ఈ క్రమంలోనే తాజాగా అజయ్ ఉరేసుకున్నట్టు రీల్స్ చేయాలనుకున్నాడు. అయితే నర్సంపేట తన చిన్నక్క ఇంటికి వెళ్లిన అజయ్.. అక్కడే మెడకు తాడు బిగించుకుని సెలఫోన్ లో చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ, అంతలోనే నిజంగానే తాడు మెడకు బిగుసుకు పోవడంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అయితే జరిగిన ఈ ఘటన వలన రీల్స్ పిచ్చి ఉండి సాహసం చేసే వారికి ఓ వార్నింగ్ లా మారింది. మరి, రీల్స్ పిచ్చిలో పడి నిజంగానే ఊరేసుకొని చనిపోయిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş