iDreamPost
android-app
ios-app

TNR కామెంట్ on “MODERN BHAKTI”

TNR కామెంట్ on “MODERN BHAKTI”

వార్నీ…..టైటిల్ లో శంకరుడి పేరుందని “ఇస్మార్ట్ శంకర్” సినిమా చూస్తూ శివరాత్రి జాగారం చేశారట… ..
ఇంకానయం స్వయంగా ఆ పరమశివుడే చినిగిన జీన్స్ వేసుకుని హీరో రామ్ రూపం లోఈ భూమి మీదకి వచ్చాడని థియేటర్ లోదీపాలు వెలిగించి పాలాభిషేకాలు చెయ్యలేదు..
మీ భక్తిని బంజారాహిల్స్ రాళ్ళ కింద పాతిపెట్ట…
భక్తి ఉంటే గుళ్ళో భజన చేస్తూ ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉండాలిగానీ ఇలా కమర్షియల్ సినిమాలు చూస్తూ టైం పాస్ చెయ్యడమేంటో..
ఒకవేళ నిజంగానే మీరు శివరాత్రి రోజును కూడా మామూలు రోజుగా భావించి జస్ట్ టైం పాస్ కోసమే సినిమాలు చూసినట్టయితే గొడవేలేదు..
కానీ..దయచేసి దానికి భక్తి అని మాత్రం పేరు పెట్టకండి.
——————————————-
[ ఈ పోస్ట్ భక్తి అనే పేరుతో సినిమాలు చూసిన వాళ్ళకి మాత్రమే.
ఈ పోస్ట్ ఒక మతానికి మాత్రమే సంబంధించింది కాదు….
ఇలాంటి వాళ్ళు అన్ని మతాల్లో ఉన్న నా స్నేహితులలో ఉన్నారు.
అలా భక్తిని వక్రీకరించే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది.. – TNR ]