iDreamPost
android-app
ios-app

ఆడవాళ్ళ జుట్టు నల్లగా, ధృడంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా??

  • Published May 26, 2022 | 8:06 AM Updated Updated May 26, 2022 | 8:06 AM
ఆడవాళ్ళ జుట్టు నల్లగా, ధృడంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా??

ఆడవారికి ఎంతో ఇష్టమైనది కురులు మరియు అవి వారికి ఎంతో అందాన్ని ఇస్తాయి. ఈరోజుల్లో మహిళలకు చాలా మందికి జుట్టు తొందరగా పలచబడుతుంది. తొందరగా తెల్లబడుతుంది. కాబట్టి మహిళలు చాలా మంది జుట్టు పెరుగుదలకు, జుట్టు రంగు కొరకు ఎంతో శ్రద్ద చూపుతున్నారు. వాటి కోసం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ని వాడుతున్నారు. బయట ప్రొడక్ట్స్ కాకుండా ఇంట్లో వాటిని ఉపయోగించి మనం మన జుట్టుని భద్రంగా పెంచుకోవచ్చు.

ఆహారపదార్థాలలో క్యారెట్ ఎక్కువగా తీసుకోవాలి. దీనిలో ఉండే విటమిన్ A జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జామకాయలో విటమిన్ C ఉంటుంది ఇది జుట్టు తెగిపోవడాన్ని తగ్గిస్తుంది. కొడిగుడ్లలో ఉండే ప్రోటీన్ జుట్టు దృడంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మెంతికూరలో అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి అవి జుట్టుని రాలకుండా, లావుగా కూడా పెరిగేలా చేస్తాయి. ఇవన్నీ రెగ్యులర్ గా తింటే జుట్టుకి చాలా మంచిది.

అలాగే చాలా మంది జుట్టు నల్లగా మారడానికి హెయిర్ కలర్స్ వాడుతుంటారు లేదా కేవలం గోరింటాకు మాత్రమే ఎక్కువగా పెడుతుంటారు. కానీ గోరింటాకు ఎక్కువగా వాడటం వల్ల జుట్టు ఎర్రగా మారుతుంది. అలాగే హెయిర్ కలర్స్ వాడితే కంటికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి జుట్టు నల్లగా అవడానికి ఒక స్పూన్ గోరింటాకు పొడి, రెండు స్పూన్లు ఉసిరి పొడిని నీటితో కలిపి జుట్టుకి బాగా పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా నెలకి రెండు సార్లు చేస్తే మీ జుట్టు నల్లగానే ఉంటుంది.