iDreamPost
android-app
ios-app

తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ ఆహారం తినకండి.. లేదంటే!

  • Published Jun 28, 2023 | 7:12 PM Updated Updated Jun 28, 2023 | 7:12 PM
  • Published Jun 28, 2023 | 7:12 PMUpdated Jun 28, 2023 | 7:12 PM
తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ ఆహారం తినకండి.. లేదంటే!

క్యాలెండర్‌లో ప్రతి నెల రెండు ఏకాదశి తిథులు వస్తాయి. ఇక హిందువులు ఏకాదశిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాఉ. అందునా ఆషాడమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపావాసం ఉండి.. నిష్టగా పూజ చేసి.. శ్రీమహావిష్ణువును ‍స్మరించుకుంటారు. ఈ ఏడాది జూన్‌ 29 అనగా గురువారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది మరి తొలి ఏకాదశిని ఎందకు ఇంత పవిత్రమైనదిగా భావిస్తారు అంటే.. మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి అలసిపోతాడు. శ్రీహరి యోగ నిద్రకు ఈరోజునే ఉపక్రమించాడని పురాణాలు చేబుతున్నాయి. అందుకే దీనిని తొలి ఏకాదశి, శయనా ఏకాదశి అంటారు. మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు.

ఈసమయలో శ్రీమహావిష్ణువు శరీరం నుంచి ఏకాదశి అనే కన్య ఉద్భవించింది. ఆమె విష్ణుమూర్తిని మూడు వరాలు కోరుతుంది. అవి ఏంటంటే.. ఒకటి తాను సదా విష్ణుమూర్తికి ప్రియంగా ఉండాలి. రెండు అన్ని తిథులలో కంటే ప్రముఖంగా ఉండి అందరిచే పూజలందుకోవాలి. మూడు ఏకాదశి తిథి నాడు భక్తితో ఉపవాసం ఉండి.. పూజించిన వారికి మోక్షము లభించాలి అని కోరినట్లు పురాణ కథలు చెబుతున్నాయి.

ఇంత పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినం రోజున కొన్ని పనులు అస్పలు చేయకూడదు అంటారు పండితులు. ఏకాదశి పర్వదినం రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని.. తలారా స్నానం చేసి.. తరువాత శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. అనంతరం చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతం చేసేవారు మాంసాహారము, వండిన ఆహారము, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా తీసుకోరాదు. అలాగే ఏకాదవి రోజున మంచం మీద నిద్ర పోకూడదు.

ఏకాదశిని ఇంత విశిష్టమైనదిగా భావించడానికి మరోక కారణం కూడా ఉంది. ఈరోజు సూర్యుడు దక్షిణం వైపునకు మరలుతాడు. ఈరోజు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. కనుకే దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారు. అలానే తొలి ఏకాదశి నుంచే ఇదే రోజు చాతుర్మాస దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఇక ఏకాదశి పర్వదినం రోజున అన్నం తినకూడదు అంటారు. ఇందుకు సంబంధించి మన పెద్దలు ఒక కథ కూడా చెబుతారు. అన్నంలో దాగిన పాప పురుషుడు, బ్రహ్మ చమట బిందువు నుంచి అవతరించిన రాక్షసుడు తనకి నివసించడానికి ప్రదేశం చూపమని కోరతాడు. అప్పుడు బ్రహ్మ. ఏకాదశి రోజు భోజనం చేసేవారి ఆహారంలో నివసించమని వరం ఇస్తాడు. అందుకే ఆరోజు భోజనం చేయడం అనారోగ్య హేతువని హెచ్చరిస్తారు పండితులు.