iDreamPost
iDreamPost
థియేటర్లలో సినిమాలు రావడం పోవడం సహజమే కానీ ఇప్పుడీ ట్రెండ్ ఓటిటిలకు కూడా ఊపందుకుంది. పండగలు లేదా శుక్రవారాలు ఏ అకేషన్ ని వదలకుండా డిజిటల్ సంస్థలు కొత్త ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. అవేంటో చూద్దాం. 31న వినాయక చవితి పండగ సందర్భంగా ఆహాలో ‘పంచతంత్ర కథలు’ రాబోతోంది. విమర్శకుల ప్రసంశలు అందుకున్న ఈ బడ్జెట్ మూవీ వెండితెర మీద చూసేందుకు ప్రేక్షకులను రాబట్టలేకపోయింది. సో డిజిటల్ లో మంచి ఛాన్స్ ఉంటుంది. ఇదే ప్లాట్ ఫార్మ్ లో అదే రోజు ‘పెళ్లికూతురు పార్టీ’ని లాంచ్ చేయబోతున్నారు. దీని మీదా అంచనాలు లేవు కానీ స్మార్ట్ స్క్రీన్ లో చూసే సౌలభ్యం కాబట్టి వ్యూస్ వస్తాయి.
సెప్టెంబర్ 2న ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఆహాలోనే ‘వాంటెడ్ పండుగాడ్’ ని విడుదల చేస్తున్నారు. రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ గురించి వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ అంతా ఇంతా కాదు. కిచ్చ సుదీప్ ‘విక్రాంత్ రానా’ జీ5 వేదికగా రాబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ ఓటిటి భారీ అంచనాలు పెట్టుకుంది దీని మీదే. ప్రభుదేవా టైటిల్ రోల్ పోషించిన ‘మై డియర్ భూతం’ సైతం అదే రోజు జీ5లో రాబోతోంది. అక్షయ్ కుమార్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రాక్షసుడు రీమేక్ ‘కట్ పుత్లీ’ డిస్నీ హాట్ స్టార్ లో వస్తోంది. తుపాకీ విలన్ విద్యుత్ జమాల్ నటించిన ‘ఖుదా హఫీఫ్ 2’ని జీ5లోనే అందివ్వబోతున్నారు.
మొత్తానికి చూసినవాళ్లకు చూసినంత ఫార్ములాతో మంచి వినోదం ఇంటి నుంచి బయటికి వెళ్లకుండానే దొరుకుతోంది. ఈ వారం థియేటర్లలోనూ ఆరుకు పైగా సినిమాలున్నాయి కానీ దేని మీదా అంత బజ్ లేదు. అన్నీ పబ్లిక్ టాక్ ని నమ్ముకున్నవే. అందుకే ప్రేక్షకులు ముందుగా ఓటిటి మీద చూపేసే ఛాన్స్ ఉంది. ఇటీవలే టాలీవుడ్ నిర్మాతలు ఇకపై జరగబోయే డీల్స్ కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన తీసుకొస్తున్న నేపథ్యంలో ఓటిటి రంగంలోనూ పలు మార్పులు రాబోతున్నాయి. మరి ఇప్పుడున్నంత దూకుడుతో భవిష్యత్తులోనూ ఈ ట్రెండ్ కనిపిస్తుందా అంటే చెప్పలేం. ఓ మూడు నెలలు ఆగితే ఫలితాలను విశ్లేషించుకోవచ్చు