iDreamPost
android-app
ios-app

బ్యాచిలర్ స్టొరీలో అదే ట్విస్టట

  • Published Feb 06, 2020 | 9:17 AM Updated Updated Feb 06, 2020 | 9:17 AM
  • Published Feb 06, 2020 | 9:17 AMUpdated Feb 06, 2020 | 9:17 AM
బ్యాచిలర్ స్టొరీలో అదే ట్విస్టట

పరిశ్రమకు వచ్చి ఐదేళ్లవుతున్నా ఇంకా హిట్ల బోణీ కొట్టని అఖిల్ కొత్త సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగాక ఆసక్తి రేపుతోంది. చాలా ఏళ్లుగా ఫామ్ లో లేని బొమ్మరిల్లు భాస్కర్ ని దర్శకుడిగా తీసుకోవడం పట్ల అభిమానులు కొంచెం టెన్షన్ గా ఉన్నా ఏదో విషయం లేనిదే గీతా ఆర్ట్స్ నిర్మాణానికి ఒప్పుకోదు కాబట్టి నమ్మకంగానే ఉన్నారు. ఇదిలా ఉండగా ఇందులో కథ ఏమై ఉంటుందానే అనుమానం మాత్రం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ ఉంది. దానికి సంబంధించి కొన్ని లీక్స్ మెల్లగా బయటికి వస్తున్నాయి.

వాటి ప్రకారం ఇందులో అఖిల్ అమెరికా నుంచి పెళ్లి సంబంధం కోసం వచ్చిన యువకుడిగా కనిపించబోతున్నాడట. వరసగా పెళ్లి చూపులకు వెళ్లడం, ఏదో ఒక కారణం వల్ల అవి సెట్ కాకుండా హీరో నిరాశ చెందడం లాంటి ఫన్నీ ఎపిసోడ్స్ చాలా ఉంటాయట. డెడ్ లైన్ పెట్టుకుని ఆ సమయంలోపే మ్యారేజ్ కావాలన్న అఖిల్ లక్ష్యం ఏమైంది అనేదే అసలు కథగా చెబుతున్నారు. హీరోయిన్ పూజా హెగ్డే పరిచయమయ్యాక మలుపు తిరుగుతుందని అక్కడి నుంచి హీరో ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చి మంచి ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుందట.

ఇది అఫీషియల్ గా వచ్చింది కాదు కానీ మొత్తానికి లైన్ అయితే మరీ కొత్తగా లేకపోయినా అఖిల్ ఏజ్ కి తగ్గట్టు స్కోప్ ఉన్నట్టు కనిపిస్తోంది. బొమ్మరిల్లు రేంజ్ మేజిక్ చేస్తే కానీ తనకు ఫ్యూచర్ లేదని గుర్తించిన భాస్కర్ దీన్ని లాస్ట్ ఛాన్స్ గా తీసుకుని రూపొందిస్తున్నట్టు యూనిట్ టాక్. అందులోనూ అక్కినేని కుర్రాడికి ఖచ్చితంగా హిట్ పడాల్సిన సినిమా ఇది. విడుదల ఇంకో రెండు నెలల్లోనే ప్లాన్ చేశారు కాబట్టి దానికి తగ్గట్టే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని సమాచారం. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ బ్యాచిలర్ టీజర్ ఈ వారంలోనే వస్తుంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibom