iDreamPost
android-app
ios-app

నయా ట్రెండ్.. దొంగలు వీటిని కూడా కొట్టేస్తున్నారు..

  • Published May 22, 2022 | 4:56 PM Updated Updated May 22, 2022 | 4:56 PM
నయా ట్రెండ్.. దొంగలు వీటిని కూడా కొట్టేస్తున్నారు..

దొంగలు కాయకష్టం చేసుకోకుండా దొంగతనాలు చేస్తూ బతికేస్తుంటారు. కొంతమంది డబ్బులు కాజేస్తే.. మరికొంతమంది బంగారు, ఇతరత్రా వస్తువులను దొంగిలిస్తుంటారు. కానీ కొంతమంది విచిత్రమైన దొంగలు కూడా ఉంటుంటారు. వారు ఏవి దొంగతనం చేశారో తెలుసుకున్న ప్రజలు షాక్ కు గురవుతుంటారు. ట్రెండ్ కు తగ్గట్టూ దొంగలు కూడా మారిపోతున్నారు. తాజాగా టమాటలను కూడా దొంగతనం చేసేస్తున్నారు. ఎందుకంటే టమాట ధరలు ఆకాశాన్ని తాకడమే కారణం. దీంతో దొంగలు టమాటలపై ఫోకస్ పెట్టేస్తున్నారు. గతంలో ఉల్లిగడ్డల దొంగతనాలు జరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా మదనపల్లిలో 10 ట్రేల టమాటలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకపోయారు. పెరిగిన ధరలతో లాభ పడుతామని అనుకున్న ఆ వ్యాపారి టమాటలు దొంగతనం కావడంతో షాక్ కు గురయ్యాడు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు కంప్లైట్ చేశాడు. అంతకుముందు కృష్ణా జిల్లాలోని పెదగంజిప్రోలులో కూడా ఇలాగే జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టమాటలను దొంగతనం చేసేస్తున్నారు.

ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయో వాటిపై దృష్టి సారించి ఎవరి కంట పడకుండా కొట్టేస్తున్నారు. గతంలో ఉల్లిగడ్డ ధరలు పెరిగితే.. మార్కెట్ లో ఉన్న ఉల్లి బస్తాలను దొంగిలించేశారు. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు నిమ్మకాయలకు ఫుల్ డిమాండ్ వచ్చింది. దీంతో అమాంతం దీని ధరలు కూడా పెరిగిపోయాయి. ఒక్కో నిమ్మకాయ సుమారు రూ. 10 పలికిందంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెలలో నిమ్మకాయల ట్రేలను తస్కరించారు. ఒక్కో ట్రేను రూ. 5 వేల వరకు విక్రయించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతోంది. పౌల్ట్రీల నుంచి కోళ్లను ఎలా దొంగిలించాలనే ప్లాన్స్ వేసుకుంటున్నారంట. ఇలా దొంగిలించిన కోళ్లను సగం రేట్లకే అమ్మేసుకుంటున్నారు కొంతమంది చోరులు. కోళ్ల ఫారాల్లో దొంగతనాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి ఏం తెలుస్తుందంటే ఏ వస్తువు ధర పెరిగిందో.. దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్న మాట.