iDreamPost
android-app
ios-app

ఆదిపురుష్ విడుదల – అంతా రెడీ

  • Published Sep 27, 2022 | 3:00 PM Updated Updated Sep 27, 2022 | 3:00 PM
ఆదిపురుష్ విడుదల – అంతా రెడీ

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఆది పురుష్ విడుదల తేదీ లాక్ అయ్యింది. 2023 జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అక్టోబర్ 2 విడుదల చేయబోయే ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టీజర్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయోధ్య వేదికగా జరగబోయే గ్రాండ్ ఈవెంట్ లో రివీల్ చేయనున్నారు ఇటీవలే పెదనాన్న కృష్ణంరాజు హఠాన్మరణంతో హతాశుడైన ప్రభాస్ ఆ గాయం నుంచి మెల్లగా కోలుకుంటున్నాడు. తన వల్ల షూటింగులు ఎక్కువ కాలం ఆగిపోతే నిర్మాతలకు ఇబ్బంది కాబట్టి వచ్చే నెల నుంచే సెట్స్ లో అడుగు పెట్టనున్నట్టు తెలిసింది. ముందు సలార్ ని ఫినిష్ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నాడు.

కనీసం ప్రీ లుక్ కూడా లీక్ కాని ఆది పురుష్ పట్ల ట్రేడ్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అసలే బాలీవుడ్ లో హిందుత్వ సెంటిమెంట్ సినిమాలకు బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివలను అంతగా ఓన్ చేసుకోవడానికి కారణం ఇదే. అక్షయ్ కుమార్ రామ్ సేతు కూడా ఈ కారణంగానే క్రేజ్ తెచ్చుకుంది. వీటికే ఇలా ఉంటే ప్యాన్ ఇండియా స్టార్ చేయబోయే మూవీ అంటే ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో వేరే చెప్పాలా. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో ఉంటాయట. సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ తదితరులు పాల్గొనే ప్రమోషన్ ఈవెంట్లను త్వరలో స్టార్ట్ చేస్తారు.

చేతిలో ఉన్న మూడు నెలలను పూర్తిగా పబ్లిసిటీకే వినియోగించబోతున్నారు. కథ రామాయణమేనా లేక వర్తమానాన్ని కలిపి ఏమైనా కొత్త అంశాలు జోడించారా అనేది గుట్టుగా ఉంచుతున్నారు. బడ్జెట్ నాలుగు వందల కోట్లకు పైగానే అయ్యిందంటున్నారు కానీ బొమ్మ చూశాక కానీ క్లారిటీ రాదు. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని ఇండియన్ అవతార్ గా వర్ణిస్తున్న విశ్లేషకులు లేకపోలేదు. క్యాస్టింగ్ కు సంబంధించి కూడా చాలా తక్కువ డీటెయిల్స్ బయటికి వచ్చాయి. సాహో ఫ్లాప్ అయ్యాక రాధే శ్యామ్ డిజాస్టర్ కావడం వల్ల ప్రభాస్ మార్కెట్ ఏం డౌన్ కాలేదు కానీ ఇప్పుడీ ఆది పురుష్ మాత్రం బాహుబలిని మించిన బ్లాక్ బస్టర్ తో రికార్డులు బద్దలు కొట్టాలని ఫ్యాన్స్ ఆకాంక్ష.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibom