iDreamPost
android-app
ios-app

LIGER లైగర్ స్టోరీ లీక్ అయ్యిందా?

  • Published Jul 16, 2022 | 12:37 PM Updated Updated Jul 16, 2022 | 12:37 PM
LIGER లైగర్ స్టోరీ లీక్ అయ్యిందా?

విజయ్ దేవరకొండ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న సినిమా లైగర్(Liger Movie). ఆగస్ట్ 25 విడుదలకు ఇంకో నలభై రోజుల సమయం మాత్రమే ఉండటంతో టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. మొన్న ఆల్మోస్ట్ న్యూడ్ అనేలా వదిలిన పోస్టర్ మాములు వైరల్ అవ్వలేదు. కెరీర్ లో మొదటిసారి విజయ్ దేవరకొండ(vijay devarakonda). ఇందులో ఎక్కువ మూమెంట్స్ ఉన్న డాన్స్ చేశాడు. అకిడి పకిడి యుట్యూబ్ లో బాగానే వెళ్తోంది. గత కొంత కాలంగా సరైన హిట్ లేక స్ట్రగుల్ అవుతున్న రౌడీ బాయ్ కు ఇది బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. సుమారు వంద కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేయొచ్చనే అంచనాలు ట్రేడ్ లో బలంగా ఉన్నాయి.

తాజాగా దీనికి సంబంధించిన స్టోరీ లైన్ అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం లైగర్ లో హీరో పాత్రకు బాక్సింగ్ అంటే పిచ్చి. జీవితంలో ఎప్పటికైనా మైక్ టైసన్(Myke Tyson) ని కలిసి అతనితో సెల్ఫీ దిగాలనేది లక్ష్యం. దాని కోసం విపరీతంగా కష్టపడతాడు. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎందరినో మట్టి కరిపిస్తాడు.ఆఖరికి తాను కోరుకున్న టైసన్ తోనే ఫైట్ చేసే పరిస్థితి వస్తుంది. తనను ఓడగొట్టి రింగ్ లో కుప్పకూలిన మాస్టర్ తో సెల్ఫీ దిగి ప్రపంచానికి చూపిస్తాడట. ఇదే లైగర్ లో అసలు పాయింటనే ప్రచారం జరుగుతోంది. ఇదొక్కటే కాదు అమ్మా నాన్న తమిళ అమ్మాయి తరహాలో బలమైన మదర్ సెంటిమెంట్ కూడా పుష్కలంగా ఉందట.

ఇది నిజమో కాదో కానీ మొత్తానికి ఆసక్తికరంగానే ఉంది. అయితే ఇప్పుడు బాక్సింగ్ మీద ఇండియాలో పెద్ద క్రేజ్ లేదు. పైగా మైక్ టైసన్ ఒకప్పుడు తోపే కానీ ఇప్పుడు కాదు. రిటైర్మెంట్ తీసుకుని ప్రశాంతంగా ఉన్నాడు. అలాంటిది హీరోకు అలాంటి గోల్ పెట్టడం ఎంతమేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. అనన్య పాండే ఈ లైగర్ తో టాలీవుడ్ కు పరిచయమవుతోంది. తల్లి క్యారెక్టర్ రమ్యకృష్ణ చేశారనే టాక్ ఉంది కానీ ఇప్పటిదాకా ఎలాంటి పోస్టర్ కానీ అప్ డేట్ కానీ ఇవ్వలేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వరస వైఫల్యాల తర్వాత లైగర్ మీదే విజయ్ దేవరకొండ ఆశలన్నీ. మరి ఈ బాక్సింగ్ ఛాంపియన్ ఏం చేస్తాడో లెట్ వెయిట్ అండ్ సీ.

Jojobet GirişMadridbetMadridbetbetciomatbet girişgrandpashabetDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren Sitelerdeneme bonusugrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet