Arjun Suravaram
Arjun Suravaram
భార్యాభర్తల బంధం అనేది ఎంతో ఉన్నతమైనది. దంపతులు ఒకరికొకరు సహకరించుకుంటేనే సంసారం హాయిగా సాగుతుంది. ముఖ్యంగా భార్య సహకారం ఉంటేనే ఆ ఇల్లు వసుదైక కుటుంబంగా ఉంటుంది. అయితే చాలా మంది మహిళలు.. పిల్లలను, కుటుంబాన్ని చూసుకుంటూ ఇంటికే పరిమితం అవుతారు. ఇంట్లో అవసరమైన వాటిని భర్త తెస్తుంటే.. ఆమె చూసుకుంటుంది. ఇలా సాగుతున్న కొన్ని కుటుంబాల్లో విధి చిన్నచూపు చూస్తుంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు. అప్పటి వరకు వంటిటికే పరిమితమైన చాలా మంది మహిళ.. ఆ తరువాత కుటుంబ బాధ్యతలు భుజాల మీద వేసుకుని బయట ప్రపంచంలోకి అడుగు పెడుతుంటారు. ఆ కోవాకు చెందిన వ్యక్తి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి కి చెందిన దుర్గాబాయి. మరి.. ఆమె కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అదిలాబాద్ మండలం ములాల్ గుట్టకు చెందిన టెకం భీంరావుతో 22 ఏళ్ల కిందట దుర్గబాయికి వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరికి 20 ఎకరాల వ్యవసాయ భూమింది. అందులోనే వ్యవసాయం చేస్తూ భీంరావు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక వీరి ముగ్గురి పిల్లల్లో కుమారులు ఆనంద్ రావు, లక్ష్మణ్ హైదరాబాద్ లో ఇంటర్ చదువుతున్నారు. కుమార్తె చిట్టిని ఆదిలాబాద్ లో డిగ్రీ చదివిస్తున్నారు. దుర్గాబాయి ఏడో తరగతి వరకు చదువుకుంది. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును ఆపేసింది. ఇక తన భర్తకు ఓనమాలు దిద్దించి నాలుగో తరతి వరకు చదివించింది.
ఇలా వ్యవసాయం చేసుకుంటూ సాగిపోతున్న వారి జీవితంలో ఓ అనుకోని విపత్కర పరిస్థితి ఎదురైంది. భీంరావుకు వెన్ను నొప్పి వచ్చింది. ఆ నొప్పితో కొన్నేళ్లుగా అతడు బాధ పడుతున్నాడు. ఇక కుటుంబ బాధ్యతలు దుర్గాబాయి మీద పడ్డాయి. ఆమె.. భర్తను పొలం వరకు తీసుకెళ్లి.. ఆయన సలహాలతోనే ఆమె మొక్కలకు మందు కొట్టడం, దుక్కి దున్నడం వంటి పనులు చేస్తున్నారు. అలానే పంట సాగు విషయంలో వచ్చిన సందేహాలను స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకునేది. వెన్నుముక సమస్యతో భీంరావు నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయాడు. అలాంటి స్థితిలో ఉన్నా ఎంతో ఓర్పు, సహనం, ధైర్యంతో తనతో పాటు కుటుంబానికి అండగా ఉంటం.. తమ అదృష్టమని భర్త భీంరావు..దుర్గాబాయిని కొనియాడారు. మరి.. ఈ వీర మహిళపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.