iDreamPost
android-app
ios-app

అదుపు తప్పి స్కూల్ బస్సు బోల్తా.. 37 మంది విద్యార్థులు..

  • Published Dec 13, 2023 | 2:48 PM Updated Updated Dec 13, 2023 | 2:48 PM

ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

అదుపు తప్పి స్కూల్ బస్సు బోల్తా.. 37 మంది విద్యార్థులు..

దేశంలో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో భయబ్రాంతులను సృష్టిస్తున్నాయి. ఒకదశలో ఇంటి నుంచి బయటకి వెళ్లి ప్రశాంతంగా ఇంటికి చేరుతామా లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అతివేగం, డ్రైవింగ్ పై సరైన అవగాహన లేకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీని ఫలితంగా ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్ద దిక్కు కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రైవర్లలో మార్పు రావడం లేదు. ఓవర్ టేక్ చేయబోయి ఓ స్కూల్ బస్ బోల్తా పడిన ఘటన ఫరూఖాబాద్‌లోని బదౌన్ లో తీవ్ర కలకం రేపింది. వివరాల్లోకి వెళితే..

షాజహాన్పూర్ జిల్లా జలాలాబాద్ సిటీలో ఓ పబ్లిక్ స్కూల్ కి సంబంధించిన బస్సు చుట్టు పక్కల ఉన్న విద్యార్థులను తీసుకువెళ్తుంది. ఈ క్రమంలోనే బదౌన్ రోడ్డు లోని అమృత్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉదయం దట్టమైన పొగమంచు ఏర్పడింది. అదే సమయంలో బస్సు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో అదుపుతప్పి డివైడర్ ని గుద్దుకొని 10 అడుగుల లోతులో మూడు నాలుగు ఫల్టీలు కొట్టి లోయలో పడిపోయింది. బస్సు ఢీ కొట్టడం అక్కడ ప్రయాణికులు భయంతో పారిపోయారు. పలు వాహనాలు రోడ్డు పై నిలిచిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచంర అందుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుకొని పరిస్థితిని పరిశీలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 47 మంది విద్యార్థులు ఉన్నారని.. అందులో కొంతమంది విద్యార్థులకు స్వల్పంగా గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు. ప్రమాదం తర్వాత ధైన్నర గ్రామానికి చెందిన ఆదిత్య తలకు గాయం, అతని సోదరి దివ్యాన్షి చేతికి గాయం అయ్యిందని ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో 35 మంది విద్యార్థులు సురక్షితంగా తప్పించుకున్నారని ఎఎస్‌పీ డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. ఇద్దరు పిల్లలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని.. పొగ మంచు కారణంగా డ్రైవర్ కి డివైడర్ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగి ఉండవొచ్చని అంటున్నారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.