iDreamPost
android-app
ios-app

అభిమాన హీరో సినిమా విడుదల.. థియేటర్‌లో పెళ్లి చేసుకున్న జంట

  • Published Oct 19, 2023 | 3:37 PM Updated Updated Oct 19, 2023 | 3:37 PM
  • Published Oct 19, 2023 | 3:37 PMUpdated Oct 19, 2023 | 3:37 PM
అభిమాన హీరో సినిమా విడుదల.. థియేటర్‌లో పెళ్లి చేసుకున్న జంట

ప్రతి ఒక్కరికి ఫేవరేట్ హీరో, హీరోయిన్లు ఉంటారు. వాళ్ల సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తుంటారు. థియేటర్ల ముందు పెద్ద పెద్ద కటౌట్లు కట్టి పాలాభిషేకాలు, పూల దండాలు, తీన్మార్ ఆడుతూ హంగామా సృష్టిస్తుంటారు. హీరో సినిమా ప్రకటించిన నాటి నుండి.. విడుదల తేదీ వరకు వచ్చే అప్ డేట్స్ చెక్ చేస్తూనే ఉంటారు. ఇక వారి పుట్టిన రోజులు వచ్చాయంటే.. కేకు కటింగ్, గుడిలో అర్చనలు, పేదలకు అన్నదానం, రక్త దానం చేస్తుంటారు. అలాగే సినిమా విడుదల సమయంలో కూడా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు డై హార్ట్ ఫ్యాన్స్. తమ హీరో సినిమా వచ్చిందని.. జీవితంలో గుర్తుండిపోయే అంకానికి శ్రీకారం చుట్టుకున్నారీ జంట.

తను అభిమానించే హీరో సినిమా రిలీజ్ అయ్యిందని.. పెద్ద మొత్తంలో భారీ రేటు పెట్టి టికెట్ కొనలేదు, కటౌట్లు కట్టించలేదు.. మెమొరబుల్ డేగా మార్చుకున్నారు. ఇంతకు ఆ హీరో ఎవరంటే.. తమిళనాట ఇళయ దళపతిగా కొలవబడుతున్న విజయ్. లోకేశ్ కనగ రాజ్ దర్శకత్వంలో వస్తున్న లియో ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 19న విడుదలైన సంగతి విదితమే. తమ హీరో సినిమా విడుదల కావడంతో.. తమిళనాడులోని పుడుక్కోటి జిల్లాకు చెందిన వెంకటేశ్, మంజుల సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లారు. మామూలు దుస్తుల్లో కాదూ పెళ్లి బట్టల్లో. విజయ్‌కు వీరాభిమానులైన వీరిద్దరికీ గతంలో నిశ్చితార్థం జరిగింది. అయితే లియో సినిమా విడుదలయ్యాక పెళ్లి చేసుకోవాలని భావించారు.

అక్టోబర్ 19న సినిమా విడుదల కానుండటంతో.. 20న పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. థియేటర్‌కు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వెంకటేశ్, మంజుల.. సినిమాను వీక్షించి.. థియేటర్లలోనే రింగులు, దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే.. లోకేశ్ కనగ రాజ్.. గత సినిమాల్లోలాగా మ్యాజిక్ చేశాడని టాక్. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. పాన్ ఇండియా మూవీగా థియేటరల్లో సందడి చేస్తోంది.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş