iDreamPost
android-app
ios-app

naatu naatu song 18 రోజులకే నాటు నాటు

  • Published Apr 11, 2022 | 5:10 PM Updated Updated Apr 11, 2022 | 5:10 PM
  • Published Apr 11, 2022 | 5:10 PMUpdated Apr 11, 2022 | 5:10 PM
naatu naatu song 18 రోజులకే నాటు నాటు

#NaatuNaatu ఆర్ఆర్ఆర్ కు రిపీట్ రన్ రావడంలో కీలక పాత్ర పోషించిన నాటు నాటు వీడియో సాంగ్ కేవలం ఇరవై రోజుల లోపే అధికారికంగా రిలీజ్ చేయడం ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇందాక యుట్యూబ్ లో అప్లోడ్ చేసిన కొద్దినిమిషాలకే అర మిలియన్ వ్యూస్ వైపు పరిగెత్తడం చూస్తుంటే చాలా తక్కువ టైంలోనే రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంత త్వరగా ఎందుకు చేశారనే కామెంట్స్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. చాలా సెంటర్స్ లో కలెక్షన్స్ లో డ్రాప్ ఉన్న మాట వాస్తవం. ముఖ్యంగా ఈ వారం కెజిఎఫ్ 2 వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల దృష్టి మొత్తం దాని మీదకు వెళ్లిపోయింది.

సో బజ్ లైవ్ గా ఉండాలంటే ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ఏదో ఒక వైరల్ కంటెంట్ ఆన్ లైన్ లో తిరుగుతూ ఉండాలి. అందులో భాగంగానే నాటు నాటుని ఇలా వదిలేశారు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఇద్దరూ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ చేసిన డాన్సులు ఎన్ని సార్లు చూసినా తనివి తీరడం కష్టం. అలాంటిది ఫ్రీగా చూసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదిలిపెడతారు. అందులోనూ నార్త్ ఆడియన్స్ ఈ పాటకు పిచ్చగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు వీడియో రూపంలో వచ్చేసింది కాబట్టి ఎన్ని రీల్స్, వీడియోలు, పోస్టులు వస్తాయో ఊహించడం కష్టం. ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం చేసినట్టే కనిపిస్తోంది.

17 రోజులకు గాను ఆర్ఆర్ఆర్ వసూలు చేసిన షేర్ సుమారు 565 కోట్ల దాకా ఉంది. అఫీషియల్ గా 1000 కోట్ల మార్కుని దాటేసింది. అయితే వరల్డ్ వైడ్ గా బాహుబలి పేరిట ఉన్న 1800 కోట్ల టార్గెట్ ని అందుకుంటుందో లేదో వేచి చూడాలి. ఇంకా చైనా జపాన్ రిలీజ్ పెండింగ్ లో ఉంది. ఎప్పుడు చేస్తారో తెలియదు. ఒకవేళ అదీ యాడ్ అయితే ఈజీగా ప్రభాస్ సినిమాను దాటేయొచ్చు. ప్రస్తుతానికి నిర్మాత దానయ్యకు అలాంటి ఆలోచన ఉందో లేదో మరి. గని వైఫల్యం వల్ల నిన్నా మొన్న కూడా మంచి వసూళ్లు నమోదు చేసుకున్న ఆర్ఆర్ఆర్ స్పీడ్ కు బీస్ట్, కెజిఎఫ్ 2లు బ్రేక్ వేస్తాయో లేదో ఇంకో రెండు మూడు రోజుల్లో తేలనుంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkolik girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş