iDreamPost
android-app
ios-app

కరెంట్ ఆఫీసుకు మొసలిని తెచ్చిన రైతు.. ఎందుకంటే..?

’దుక్కి దున్నినాడమ్మా చందమామ రైతు, మొక్క నాటినాడమ్మా చందమామ రైతు’ అంటూ ఓ కవి అన్నదాత గురించి వర్ణించారు. పంట చేతికి వచ్చే సరికి ఆరుగాలం పట్టేస్తుంది. ఈ ఆరు నెలలు రైతు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, అధికారులు సైతం మొండిచేయి చూపిస్తున్నారు.

’దుక్కి దున్నినాడమ్మా చందమామ రైతు, మొక్క నాటినాడమ్మా చందమామ రైతు’ అంటూ ఓ కవి అన్నదాత గురించి వర్ణించారు. పంట చేతికి వచ్చే సరికి ఆరుగాలం పట్టేస్తుంది. ఈ ఆరు నెలలు రైతు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, అధికారులు సైతం మొండిచేయి చూపిస్తున్నారు.

కరెంట్ ఆఫీసుకు మొసలిని తెచ్చిన రైతు.. ఎందుకంటే..?

దేశానికి రైతులే వెన్నుముక అంటారు. కానీ అన్నం పెట్టే రైతు మాత్రం కష్టాల కడలిలో కూరుకుపోతున్నాడు. విత్తు వేసిన నాటి నుండి మార్కెట్‌లో సరుకు అమ్ముడయ్యే వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. అతి వృష్టి, అనావృష్టి కారణంగా రైతుకు కడగండ్లు మిగులుతుంటే.. దళారీ చేతిలో చిక్కి మోసపోతున్నాడు. తమను ఆదుకుంటారని భావించే ప్రభుత్వాలు, అధికారులు కూడా సహకరించకపోవడంతో.. అప్పుల పాలై.. ఏం దిక్కుతోచని స్థితిలో ఉరి కొయ్యలకు వేలాడుతున్నారు రైతులు. ముఖ్యంగా పగటి పూట కరెంట్ అందించకపోవడంతో.. పొలాలకు నీరు అందకపోవడంతో.. పంట ఎండిపోయి తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాడు.

పగటి పూట కరెంట్ ఇవ్వకపోడంతో విసుగు చెందిన ఓ రైతు..  ఓ చర్యకు దిగాడు. విద్యుత్ కార్యాలయానికి ఏకంగా మొసలిని తీసుకు వచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపూర్ జిల్లా కొల్హారా తాలుకాలోని రోనిహల్ గ్రామంలో అనేక మంది రైతు కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే కొన్ని నెలలుగా పగటి పూట కరెంట్ ఇవ్వకుండా.. రాత్రిళ్లు ఇస్తున్నారు. పంటకు నీరు పెట్టేందుకు పగటి పూట విద్యుత్ అందించాలని పలు రైతు కుటుంబాలు అధికారులకు విన్నవించారు. అయినప్పటికీ.. విద్యుత్ అధికారుల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన ఓ రైతు.. తాళ్లతో కట్టేసిన మొసలిని ట్రాక్టర్ లో తీసుకువచ్చి హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయం వద్దకు చేరాడు.

మొసలిని ట్రాక్టర్ నుండి దింపి.. నిరసన చేపట్టాడు. దీన్ని చూసిన అధికారులు ఒక్కసారిగా ఆందోళన చెందారు.  కొన్ని రోజులుగా తమ సమస్యను అధికారులకు చెబుతూనే ఉన్నప్పటికీ.. పగటి పూట కరెంట్ ఇవ్వాలని మొరపెట్టుకున్నప్పటికీ వారు పట్టించుకోలేదని, రాత్రుళ్లు కరెంట్ ఇస్తే.. చీకట్లో పొలాలకు ఎలా వెళతారని ప్రశ్నించారు. చీకట్లో పాములు, తేళ్లు, మొసళ్లు, అడవి జంతువల నుండి ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పూట నీళ్లు పెట్టలేకపోతున్నామని, పగలు కరెంట్ కోతలు పెడుతున్నారని, దీంతో పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇలా చేసినట్లు రైతులు చెబుతున్నారు.