కరోనా లాక్ డౌన్ వల్ల మూతపడిన ఈఫిల్ టవర్ ఎట్టకేలకు తెరుచుకుంది. కరోనా కారణంగా 104 రోజుల పాటు ఈఫిల్ టవర్ సందర్శనను ఫ్రాన్స్ ప్రభుత్వం మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా సందర్శకులను తిరిగి అనుమతిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా సందర్శకులను పరిమిత సంఖ్యలోనే ఈఫిల్ టవర్ సందర్శనకు అనుమతించింది.
ఇప్పటివరకు చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఒక్కసారి మాత్రమే ఈఫిల్ టవర్ మూతపడింది. తర్వాత కరోనా వైరస్ ఫ్రాన్స్ లో తీవ్రస్థాయిలో విజృంభించడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఈఫిల్ టవర్ సందర్శనను నిలిపివేసింది. ఫ్రాన్స్ లో 161,34 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 29,752 మంది మృత్యువాత పడ్డారు. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఫ్రాన్స్ 16 వ స్థానంలో కొనసాగుతుంది.