iDreamPost
android-app
ios-app

Samsung బంపరాఫర్.. ఉచితంగా రూ. లక్ష విలువ చేసే ఫోన్.. ఎలా పొందొచ్చంటే?

  • Published Jul 27, 2024 | 7:30 PM Updated Updated Jul 27, 2024 | 7:30 PM

Samsung Galaxy Z Flip6: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ బంపరాాఫర్ ను ప్రకటించింది. ఏకంగా లక్ష రూపాలు విలువ చేసే ఫోన్ ను ఉచితంగా అందించనున్నది. ఈ ఫోన్ ను ఫ్రీగా ఎలా పొందొచ్చంటే?

Samsung Galaxy Z Flip6: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ బంపరాాఫర్ ను ప్రకటించింది. ఏకంగా లక్ష రూపాలు విలువ చేసే ఫోన్ ను ఉచితంగా అందించనున్నది. ఈ ఫోన్ ను ఫ్రీగా ఎలా పొందొచ్చంటే?

  • Published Jul 27, 2024 | 7:30 PMUpdated Jul 27, 2024 | 7:30 PM
Samsung బంపరాఫర్.. ఉచితంగా రూ. లక్ష విలువ చేసే ఫోన్.. ఎలా పొందొచ్చంటే?

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒలంపిక్ గేమ్స్ 2024 జులై 26న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వరల్డ్ వైడ్ గా ఉన్న అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. పసిడి పతకమే లక్ష్యంగా దేశ ఖ్యాతిని నలుదిశలా చాటేందుకు బరిలోకి దిగుతున్నారు. ఈ క్రీడలు ఆస్టు 11వరకు జరుగనున్నాయి. ఒలంపిక్ క్రీడలకు పారిస్ ఆతిథ్యమిస్తోంది. ఈ క్రీడల సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రానక్స్ సంస్థ శాంసంగ్ సంచలన నిర్ణయం తీసుకుంది. లక్ష రూపాయలు విలువ చేసే ఫోన్ ను ఉచితంగా అందిస్తోంది. మరి మీరు కూడా ఈ ఫోన్ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ అందరికి కాదండోయ్. ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్స్ కు మాత్రమే.

ఏ కంపెనీ అయిన తమ ప్రొడక్ట్ ను సేల్ చేసుకునేందుకు వినూత్నమైన ప్రమోషన్స్ ను చేపడుతుంది. క్రికెట్, ఒలంపిక్ గేమ్స్ సందర్భంగా పలు కంపెనీలు తమ బ్రాండ్ వాల్యూ పెంచుకునేందుకు తమ విలువైన ఉత్పత్తులను క్రీడాకారులకు ఫ్రీగా అందిస్తుంటాయి. ఈక్రమంలో శాంసంగ్ కూడా లక్ష రూపాయల విలువైన ఫోన్ ను ఒలంపిక్ అథ్లెట్స్ కు అందిస్తోంది. మీరు ఒలంపిక్ క్రీడల్లో పాల్లొంటున్నట్లైతే 1.09 లక్షల ఫోన్ను ఫ్రీగా అందుకోవచ్చు. పారిస్ ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్స్ కు కార్పోరేట్ కంపెనీలు కళ్లు చెదిరే గిఫ్టులను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శాంసంగ్ కంపెనీ అథ్లెట్స్ కు ప్రత్యేకమైన కిట్ ను అందిస్తోంది. ఆ కిట్ లో రూ. 1.09 లక్షల విలువైన గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఒలింపిక్ ఎడిషన్ ను ఫ్రీగా అందిస్తోంది.

ఈ ఫోన్ ను పొందాలంటే నేషనల్ ఒలంపిక్ కమిటీలో నమోదవ్వాలి.అందులో చేరిన వారికి పారిస్ లోని ఒలింపిక్ విలేజ్ చెఫ్ డి మిషన్ కు చేరిన వెంటనే కిట్ అందిస్తారు. శాంసంగ్ అందించే కిట్ లో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఒలింపిక్ ఎడిషన్ తో పాటు ఐఓసీ వెల్ కమ్ గైడ్, కోకా కోలా సిగ్ బాటిల్, పారిస్ 2024 పవర్ ఏడ్ స్క్వీజ్ బాటిల్, పీఅండ్జీ బ్రాండెడ్ టాయిలెట్రిస్ బ్యాగ్ పొందొచ్చు. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 ఒలింపిక్ ఎడిషన్ ఫోన్ 12జీబీ ర్యామ్.. 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ని అందించారు. 6.7 ఇంచెస్ అమోఎల్ఈడీ డిస్ప్లేను కలిగి ఉంది. 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 50 ఎంపీ కెమెరా సెల్ఫీల కోసం 10 ఎంపీ కెమెరాను అందించారు.

 

View this post on Instagram

 

A post shared by Frame Thanakhan Ch. (@frame_thnk)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişacerbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom