iDreamPost
android-app
ios-app

ప్రియురాలికి ముద్దు పెట్టి ఆస్పత్రి పాలైన ప్రియుడు! అసలు విషయం ఏంటంటే?

  • Published Aug 31, 2023 | 2:38 PM Updated Updated Aug 31, 2023 | 2:38 PM
  • Published Aug 31, 2023 | 2:38 PMUpdated Aug 31, 2023 | 2:38 PM
ప్రియురాలికి ముద్దు పెట్టి ఆస్పత్రి పాలైన ప్రియుడు! అసలు విషయం ఏంటంటే?

ప్రేమలో మునిగి తేలుతున్న చాలా మంది లవర్స్, పెళ్లైన భార్యాభర్తలు ప్రేమను వ్యక్త పరుచుకోవడానికి అప్పుడప్పుడు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటుంటారు. ఇదిలా ఉంటే.. ముద్దు పెట్టుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వైద్యులు చెబుతుంటారు. అచ్చం ఇలాగే ప్రియురాలికి ముద్దు పెట్టుకున్న ఓ యువకుడు చివరికి ఆస్పత్రి పాలయ్యాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏంటంటే?

మీడియా కథనం ప్రకారం.. చైనా తూర్పు జేజియాంగ్ ప్రావిన్స్ లో వెస్ట్ లేక్ సమీపంలోని ఓ ప్రాంతంలో ఓ యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. వీళ్లు గత కొంత కాలం నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. అయితే ఆగస్టు 22న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ప్రేమికులు కలుసుకున్నారు. కొద్ది సేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ప్రియుడు తన ప్రియురాలికి 10 నిమిషాల పాటు ఆగకుండా ముద్దు పెట్టాడు. ఈ సమయంలోనే ఉన్నట్టుండి ప్రియుడి చెవిలో నొప్పిగా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు.

వైద్యులు పరిశీలించగా.. అతని కర్ణభేరి పగిలిపోయిందని చెప్పారు. ఉన్నట్టుండి అతని చెవిలోకి ఎక్కువగా గాలి వెళ్లడం కారణంగానే ఇతని కర్ణభేరి ప్రమాదానికి గురైందని వైద్యులు తెలిపారు. కాగా, ఇతడు కోలుకోవడానికి దాదాపు 2 నెలల సమయం పట్టే అవకాశం ఉందని కూడా అన్నారు. ముద్దు కోసం వెళ్తే చివరికి ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చిందని కొందరు నెటిజిన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇస్రో శాస్త్రవేత్తపై యువకుడి దాడి.. వీడియో వైరల్‌

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet