iDreamPost
android-app
ios-app

కమల్ సినిమా సీక్వెల్ కి అదే ఇబ్బంది

  • Published Jun 09, 2021 | 5:51 AM Updated Updated Jun 09, 2021 | 5:51 AM
కమల్ సినిమా సీక్వెల్ కి అదే ఇబ్బంది

ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ థ్రిల్లర్ గా ఎప్పటికీ దృశ్యం నిలిచిపోతుందన్నది వాస్తవం. మలయాళంలో చాలా తక్కువ బడ్జెట్ లో రూపొంది కేరళ ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టిన ఈ బ్లాక్ బస్టర్ ని వెంకటేష్, కమల్ హాసన్, రవిచంద్రన్, అజయ్ దేవగన్ లాంటి ఇతర బాషల అగ్ర హీరోలందరూ ఏరికోరి మరీ రీమేక్ చేసుకుని సూపర్ హిట్లు అందుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తో దర్శకుడు జీతూ జోసెఫ్ సీక్వెల్ ని రూపొందించి దృశ్యం 2 పేరుతో ఈ ఏడాది ప్రారంభంలో నేరుగా ప్రైమ్ ఓటిటిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిజిటల్ లో వచ్చినా కూడా కంటెంట్ ఉండటంతో మరోసారి ఇది ప్రేక్షకులను అలరించింది.

తెలుగు వెర్షన్ ని ఇప్పటికే వెంకటేష్ పూర్తి చేశారు. రిలీజ్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఓటిటి వైపే మొగ్గు చూపొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ రాబోయే రెండు మూడు వారాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటే అప్పుడు పెద్దతెరపై చూసే ఛాన్స్ దక్కొచ్చు. నిర్మాత సురేష్ బాబు మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. ఇదిలా ఉండగా తమిళ రీమేక్ పనులు మొదలుపెట్టారు జీతూ జోసెఫ్. పాపనాశం పేరుతో రూపొందిన ఫస్ట్ పార్ట్ హిట్ అయిన క్రమంలో అభిమానులు రెండో భాగాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. అందుకే లోకనాయకుడు సైతం అనుకూలంగా ఉన్నారు.

అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. పాపనాశం చేసే టైంకి కమల్ గౌతమిలు సహజీవనంలో ఉన్నారు. అందుకే మీనా బదులుగా ఆవిడను తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఎక్కడా పరస్పరం ఒకరి ప్రస్తావన మరొకరు బయట తేవడం లేదు. ఇప్పుడు పాపనాశం 2 తీయాలంటే గౌతమి ఉంటేనే బాగుంటుంది. అలా కాకుండా మీనానో ఇంకెవరినో రీ ప్లేస్ చేస్తే కథ కంటిన్యూ అవుతున్న ఫీలింగ్ దక్కదు. అందుకే ఇది స్టార్ట్ చేసే విషయంలో ఆలస్యం జరుగుతోందని చెన్నై టాక్. అన్నట్టు దృశ్యం 3 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే టాక్ ఉంది. స్పైడర్ మ్యాన్ సిరీస్ లాగా దృశ్యం ఇకపై కూడా కొనసాగుతుందేమో