iDreamPost
android-app
ios-app

OTT Prices : భవిష్యత్తు OTTలో ఆ మార్పు తప్పదేమో

  • Published Jan 08, 2022 | 10:31 AM Updated Updated Jan 08, 2022 | 10:31 AM
OTT Prices : భవిష్యత్తు OTTలో ఆ మార్పు తప్పదేమో

ఓటిటిలో సాధారణంగా ఏడాది లేదా నెలవారీగా చందా కడితే సంవత్సరం పొడవునా అందులో కంటెంట్ ని ముగ్గురు నలుగురు కలిసి చూసుకోవచ్చు. అన్నీ ఇదే ఫాలో అవుతున్నాయి. కానీ విదేశాల్లో పద్ధతి వేరే ఉంటుంది. అక్కడ కొన్ని యాప్స్ పే పర్ వ్యూ మోడల్ ని అమలు చేస్తాయి. అంటే ఒకసారి సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలంటే ఒక నిర్దిష్టమైన సొమ్ముని చెల్లించాల్సి ఉంటుంది. డబ్బు కట్టగానే ఫలానా తేదీ ఫలానా టైంలో దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. మన దేశంలో యుట్యూబ్ తో పాటు బుక్ మై షో ఇదే తరహాలో ఎంటర్ టైన్మెంట్ అమ్ముతోంది కానీ ఆశించిన ఫలితాలు పూర్తి స్థాయిలో దక్కడం లేదు. ఒకరకంగా ఫెయిలని చెప్పాలి.

ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఉంది. కరోనా మూడో వేవ్ విజృంభిస్తున్న వేళ భారీ సినిమాలు ఇలా పే పర్ వ్యూ తరహాలో రిలీజ్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు డిజిటల్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో జీ5 సల్మాన్ ఖాన్ రాధేకు ఇలాగే చేసింది కానీ థియేట్రికల్ రెవిన్యూ రేంజ్ లో లాభాలు రాలేదు. మూవీ డిజాస్టర్ కావడం నిజమే కానీ కండల వీరుడి ఇమేజ్ ముందు అది తక్కువ మొత్తమే. అంతకు ముందు విజయ్ సేతుపతి కెపే రణసింగంను కూడా ఇలాగే రిలీజ్ చేశారు. అయినా ఫలితం దక్కలేదు. అయినా పదే పదే డబ్బులు కట్టి ఇంట్లోనే సినిమాలు చూడటం ఇంకా మనవాళ్లకు అలవాటు కాలేదు.

అందుకే ఎన్ని ప్రయత్నాలు చేసినా పే పర్ వ్యూ మోడల్ మన దేశంలో ఫెయిల్యూర్ గానే నిలుస్తోంది. నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా వందల కొద్ది ఛానల్స్ కు మూడు వందల రూపాయలు కట్టి వినోదానికి అలవాటు పడిన ఆడియన్స్ ని హఠాత్తుగా ఒక సినిమాకు అంతేసి డబ్బు అది కూడా ఒక్కసారి చూసేందుకు మాత్రమే పరిమితం చేస్తే సక్సెస్ కావడం కష్టం. అలా అని ఓటిటిలో ఈ దిశగా ఆలోచించడం మానేయలేదు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈ మోడల్ కు మంచి ఫ్యూచర్ ఉందని వాళ్ళ ఉద్దేశం. కరోనా వల్ల ఓటిటికి విపరీతంగా అలవాటు పడిన మన ప్రేక్షకులు త్వరలో దీన్ని కూడా అంగీకరించక తప్పదేమో. ఎవరు చెప్పొచ్చారు.

Also Read : OTT Premiers : ఒకేరోజు రాబోతున్న సూపర్ బ్లాక్ బస్టర్లు