కొత్త ప్రభాకర్ రెడ్డిని పొడిచింది అందుకేనట.. నేరం ఒప్పుకున్న నిందితుడు

తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ప్రచారాలను మొదలు పెట్టేశాయి. తమ నియోజకవర్గంలోని ఓటర్లను అభ్యర్థించేందుకు ప్రజల వద్దకు వెళుతున్నారు నేతలు. ఈ ప్రచార క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. అయితే అతడు దాడి ఎందుకు చేశాడంటే..?

తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ప్రచారాలను మొదలు పెట్టేశాయి. తమ నియోజకవర్గంలోని ఓటర్లను అభ్యర్థించేందుకు ప్రజల వద్దకు వెళుతున్నారు నేతలు. ఈ ప్రచార క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. అయితే అతడు దాడి ఎందుకు చేశాడంటే..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారాలతో ఊరువాడ తిరుగుతున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు. జోరుగా ప్రచారం చేస్తున్న సమయంలో మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. రాజు అనే వ్యక్తిని చితకబాదారు ఆ పార్టీ కార్యకర్తలు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేగింది. ఇది ముమ్మాటికి ప్రతిపక్ష కాంగ్రెస్ పనేనంటూ బీఆర్ఎస్ అగ్రనేత నుండి కార్యకర్తల వరకు దుయ్యబట్టారు. దీన్నే ఆయుధంగా చేసుకుని ప్రసంగాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము లేకనే.. హింసా రాజకీయాలు చేస్తున్నారంటూ మండిడుతున్నారు.

అయితే ఎన్నికల ముందు జరిగే స్టంట్ అంటూ కొంత మంది మాట్లాడుకోవడంపై పోలీసులు స్పందించారు. అయితే ఈ హత్యా యత్నం వెనుక వివరాలను వెల్లడించారు సిద్దిపేట పోలీసులు. రాజు కావాలనే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. అతడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యేందుకు ఈ చర్యకు దిగాడని తెలిపారు. ఈ విషయాన్ని నిందితుడు చెప్పినట్లు వెల్లడించారు.  విరుదొడ్డి మండలం పెద్ద చెపాల్యకు చెందిన ఘటని రాజు.. యూట్యూబ్‌లోని పలు ఛానల్స్‌లో విలేకరిగా పనిచేస్తున్నాడు. కొంత మందిని బెదిరించి డబ్బులు కూడా వసూలు చేశాడని చెప్పారు పోలీసులు. ఈ క్రమంలో అతడు జల్సాలకు అలవాడు పడ్డాడని, తను ఫేమస్ అయ్యేందుకు ఎంపీని హత్య చేసేందుకు కుట్ర పన్నాడని చెప్పారు.

ఇప్పుడు ఎన్నికల సమయంతో.. ఎంపీ ప్రచారానికి వస్తాడని తెలిసి.. పథకం రచించాడు. దుబ్బాక మర్కెట్‌లో కత్తిని కొనుగోలు చేశాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ప్రచారానికి వచ్చిన ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు.  వెంటనే స్పందించిన కార్యకర్తలు ఆయన్ను గజ్వేల్ ఆసుపత్రికి, అక్కడ నుండి యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కత్తి లోతుగా పొడుచుకోవడంతో.. ఆపరేషన్ చేస 10 సెంటీమీటర్ల మేర పేగును తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఎప్పటి కప్పుడు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్ డేట్ ఇస్తున్నారు.

Show comments