Dharani
TGSRTC Semi Deluxe, Metro Deluxe Buses No Free Journey: తెలంగాణలో ఉచిత జర్నీకి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఆ వివరాలు..
TGSRTC Semi Deluxe, Metro Deluxe Buses No Free Journey: తెలంగాణలో ఉచిత జర్నీకి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే అధికారంలోకి రాగానే ముందుగా ఆ హామీనే అమలు చేస్తోంది. అయితే దీని వల్ల ఆర్టీసీలో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య ఎక్కువయ్యింది. దాంతో పురుషులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీ తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉచిత ప్రయాణం వల్ల రద్దీతో పాటు ఆర్టీసీ ఆదాయం కూడా భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే.. త్వరలోనే కొన్ని బస్సుల్లో ఉచిత జర్నీని తొలగించనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..
బస్సుల్లో పెరిగిన రద్దీకి అనుకూలంగా ఆర్టీసీ రెండు కొత్త కేటగిరీ బస్సులను తీసుకురానుంది. వీట్లిలో మాత్రం మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం లేదు. టికెట్ తీసుకోవాల్సిందే. ఇంతకు ఆ బస్సులు ఏవంటే.. సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ బస్సులు. వీటిల్లో ప్రధాన పట్టణాల మధ్య సెమీ డీలక్స్ బస్సులను నడపనుండగా.. సిటీలో త్వరలోనే మెట్రో డీలక్స్ బస్సులు రోడ్డెక్కుతాయి అంటున్నారు. వీటిల్లో మాత్రం మహిళలకు ఉచిత జర్నీ అవకాశం లేదు.. టికెట్ కొనాల్సి ఉంటుంది.
ఆర్టీసీ యాజమాన్యం.. ప్రధాన నగరాల్లో పల్లోవెలుగు, ఎక్స్‌ప్రెస్ కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ కేటగిరీని ఆర్టీసీ సంస్థ ప్రవేశపెడుతోంది. ఎక్స్‌ప్రెస్ కంటే వీటిల్లో టికెట్ ధర 5 నుంచి 6 శాతం ఎక్కువగా ఉండనుంది. అలాగే డీలక్స్ కంటే 4 శాతం తక్కువగా ఉండనుంది. ఎక్స్‌ప్రెస్ బస్సులతో పోలిస్తే.. సీట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులకు డిమాండ్ ఉండే రూట్‌లలోనే ఈ బస్సులను తిప్పాలని సంస్థ నిర్ణయించింది. మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల పురుషులకు సీట్లు దొరక్క.. దాదాపు 20 శాతం మంది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారని.. ఇప్పుడు వారంతా ఈ బస్సులెక్కుతారని ఆర్టీసీ భావిస్తోంది.
ఇక నగరంలో ఆర్టినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ప్రయాణం ఉండటంతో వాటిల్లో రద్దీ బాగా పెరిగింది. ఇప్పుడు రానున్న మెట్రో డీలక్స్ బస్సుల్లో మహిళలు కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 300 బస్సులను రోడ్డెక్కించాలని భావిస్తున్నారు.