iDreamPost
android-app
ios-app

సెలవు తీసుకున్న రెబెల్ స్టార్

  • Published Sep 11, 2022 | 10:36 AM Updated Updated Dec 12, 2023 | 6:48 PM

ఎంత నలతగా ఉన్నా చలాకీగా కనిపించే కృష్ణంరాజు గారు ఆ మధ్య ఈశ్వర్ యానివర్సరీ సందర్భంగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రభాస్ పెళ్లి చూస్తారనుకుంటున్న తరుణంలో ఇలా విషాదాన్ని మిగిల్చారు.

ఎంత నలతగా ఉన్నా చలాకీగా కనిపించే కృష్ణంరాజు గారు ఆ మధ్య ఈశ్వర్ యానివర్సరీ సందర్భంగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రభాస్ పెళ్లి చూస్తారనుకుంటున్న తరుణంలో ఇలా విషాదాన్ని మిగిల్చారు.

సెలవు తీసుకున్న రెబెల్ స్టార్

మరో సినీ ధృవతార ఆకాశానికేగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారు ఇవాళ ఉదయం హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కోలుకోలేక కన్నుమూశారు. వయసు 83 సంవత్సరాలు. మార్చిలో విడుదలైన రాధే శ్యామ్ చివరి చిత్రం. ఎంత నలతగా ఉన్నా చలాకీగా కనిపించే కృష్ణంరాజు గారు ఆ మధ్య ఈశ్వర్ యానివర్సరీ సందర్భంగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రభాస్ పెళ్లి చూస్తారనుకుంటున్న తరుణంలో ఇలా విషాదాన్ని మిగిల్చారు. పెదనాన్న అంటే ప్రాణంగా భావించే ప్రభాస్ ఎంతటి మానసిక క్షోభలో ఉంటాడో ఊహకందనిది. రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసి వివిధ పార్టీలలో పని చేశారు.
Rebel Star
కృష్ణంరాజు గారి పుట్టిన ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. 1940 జనవరి 20న జన్మించారు. జర్నలిస్టుగా ప్రస్థానం మొదలు పెట్టినప్పటికీ సినిమాల మీద వ్యామోహం ఆయన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. 1966లో చిలకా గోరింకతో ఎంట్రీ ఇచ్చారు. తొలుత చిన్న పాత్రలు, విలన్ వేషాలు దేనికీ నో చెప్పకుండా అన్నింటిలోనూ మెప్పించారు. అవే కళ్ళులో ప్రతినాయకుడిగానూ రాణించారు. 1975 తర్వాత అయన కెరీర్ ఊపందుకుంది. రెండు నంది పురస్కారాలు దక్కాయి. భక్త కన్నప్పగా ఇప్పటికీ ఎవరినీ ఊహించుకోలేనంత గొప్పగా ప్రాణ ప్రతిష్ఠ చేశారు. 1986 తాండ్ర పాపారాయుడు అప్పటి కాలంలోనే బాహుబలి రేంజ్ ప్యాన్ ఇండియా మూవీ.
The rebel star took a vacation
గోపికృష్ణ బ్యానర్ ని స్థాపించి నిర్మాతగానూ ఎన్నో మరపురాని ఆణిముత్యాలను అందించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తో మొదలుపెట్టి ఇప్పటి అల్లు అర్జున్ దాకా అన్ని తరాలతో నటించిన అనుభవం గడించారు. సౌమ్యుడిగా పేరున్న కృష్ణంరాజు ఎలాంటి వివాదాలు కొనితెచ్చుకునే వారు కాదు.రాజకీయాల్లోనూ రాణించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి 1999లో బిజెపిలో ఉండి కేంద్ద్ర మంత్రిగానూ పని చేశారు. ప్రజారాజ్యంలో కొద్దిరోజులు ఉన్నారు. రాధే శ్యామ్ లో ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే చివరి జ్ఞాపకంగా మిగులుతుందని ఎవరూ ఊహించలేదు. భౌతికంగా దూరమైనా కృష్ణంరాజు గారి ముద్ర అందరిలో శాశ్వతంగా ఉండిపోతుంది