Idream media
Idream media
కువైట్‌లోని అల్‌ఫర్వానియా ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్ క్వారంటైన్‌గా మారింది. అందులో తెలుగు కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కువైట్‌ని పూర్తిగా కరోనా భయం చుట్టుముట్టింది. అన్ని విమానాలను రద్దు చేసింది. పౌరులను ఇళ్లలోనే ఉండాలని సూచించింది. మార్కెట్లు, కేప్స్, హెల్త్ క్లబ్స్ అన్నిటిని మూసేసింది. ఉద్యోగులకు రెండు వారాల సెలవు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మన తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంటులో ఒక వ్యక్తి, కరోనా రోగితో కలిసి తిరిగాడనే అనుమానంతో మొత్తం అపార్ట్‌మెంట్‌ని దిగ్బంధనం చేశారు. ఇద్దరు పోలీసు అధికారుల్ని అక్కడ కాపలా పెట్టారు. అపార్ట్‌మెంట్ వాసులకి అవసరమైన నిత్యావసర సరుకుల్ని ఈ అధికారులు అందిస్తారు. మొత్తం 14 రోజులు ఎవరూ బయటకు రావడానికి వీల్లేదు. బతకడం కోసం వెళ్లి ఇబ్బందుల్లో ఇరుక్కున్నామని మన వాళ్లు ఆవేదన చెందుతున్నారు.
ఒక్క కువైట్ మాత్రమే కాదు, అన్ని గల్ఫ్ దేశాల్లో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది. మసీదుల్లో గుమికూడి నమాజ్‌పై కూడా నిషేధం విధించారు. ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాల్సి ఉంటుంది.