iDreamPost
iDreamPost
తెలుగు రాష్ట్రాల్లో మీడియా డబల్ యాక్షన్ చేస్తోంది. ఒకే మీడియా తెలంగాణా వ్యవహారాల్లో ఒకలాగ, ఏపి విషయంలో మరోలాగ వ్యవహరిస్తోంది. ఏపి విషయంలో తప్పని చెప్పింది అదే విషయాన్ని తెలంగాణాలో ఒప్పని ఒప్పేసుకుంటోంది. అలాగే తెలంగాణాలో కరెక్టుగా అనిపించిది ఏపికి వచ్చేసరికి తప్పులుగా కనబడుతోంది మీడియాకు. పైగా ఏపిలో చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూపిస్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో నానా యాగీ చేస్తోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలోనే ఈ విషయం బయటపడింది. తాజాగా కరోనా వైరస్ విషయంలో మరోసారి మీడియా డబల్ యాక్షన్ అర్ధమైపోతోంది.
స్ధానిక సంస్ధల ఎన్నికల విషయాన్నే తీసుకుంటే ఏకగ్రీవాల విషయంలో తెలంగాణాలో చాలా గొడవలే జరిగాయి. అయితే ఒక్క విషయంలో కూడా కేసియార్ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ ఒక్క కథనం కూడా కనబడలేదు. ఏకగ్రీవాలు కాని చోట్ల ఓటింగ్ సందర్భంగా జరిగిన గొడవలకైతే లెక్కేలేదు. అయితే జరిగిన గొడవలేవీ మీడియా దృష్టికి రాలేదు. కాబట్టి గొడవలపై అసలు కవేరీజేనే లేదు. కాబట్టి స్ధానిక సంస్ధల ఎన్నికలంతా తెలంగాణాలో ప్రశాంతం.
అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధ విషయంలో కూడా ప్రభుత్వల వైపు నుంచి కొన్ని లోపాలున్నాయి. అయితే లోపాలను మీడియా పట్టించుకోలేదు. పైగా కేసియార్ ఏమి చేసినా బ్రహ్మాండమంటున్నాయి. కేసియార్ ఏమి చెబితే అంతే రాస్తాయి కాని సొంతంగా ఒక్క కథనం కూడా ఉండటం లేదు. సరే ప్రతిపక్షాలు కూడా కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకునే సంక్షోభసమయం కాబట్టి సంయమనం పాటిస్తున్నాయి.
అదే ఏపి విషయానికి వచ్చేసరికి మీడియా రెచ్చిపోతోంది. తెలంగాణాలో మౌనం పాటిస్తున్న మీడియా ఏపిలో జగన్మోహన్ రెడ్డి విషయంలో చిన్న తప్పులు జరిగినా భూతద్దంలో చూపిస్తోంది. జరుగుతున్న మంచిపనులకన్నా నెగిటివ్ కోణాన్ని మాత్రం హైలైట్ చేస్తోంది. తెలంగాణాలో కన్నా వైరస్ బాధితులు ఏపిలో తక్కువగా ఉందంటేనే జగన్ ఎంత గట్టిగా పనిచేస్తున్నాడో అర్ధమైపోతోంది. అదే సమయంలో జగన్ పై బురద చల్లటానికి ప్రతిరోజు చంద్రబాబునాయుడు అండ్ కో రెడీగా ఉంటున్నారు.
ఆచరణ సాధ్యంకాని విషయాలను పదే పదే మీడియాలో మాట్లాడుతూ జగన్ పై బురద చల్లేస్తున్నారు. దానికి చంద్రబాబు మీడియా బాగా ఇంపార్టెన్స్ ఇస్తోంది. మరి ఒకే మీడియా తెలంగాణాలో ఒకలాగ ఏపి విషయంలో మరోలాగ ఎందుకు వ్యవహరిస్తోంది ?తెలంగాణలో టీడీపీ అంతరించింది కబట్టా?లేక కెసిఆర్ వీళ్లకు తగిన పాఠం నేర్పించటం వలనా?