iDreamPost
android-app
ios-app

TS: తెలంగాణ మహిళలకు శుభవార్త.. ఆ పథకాన్ని మళ్లీ తీసుకొస్తున్న సర్కార్‌

  • Published Feb 26, 2024 | 10:10 AM Updated Updated Feb 26, 2024 | 10:10 AM

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల స్వయం అభివృద్ధి కోసం ఓ మంచి శుభవార్తను అందించింది. త్వరలోనే దీనిని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల స్వయం అభివృద్ధి కోసం ఓ మంచి శుభవార్తను అందించింది. త్వరలోనే దీనిని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా ప్రకటించారు.

  • Published Feb 26, 2024 | 10:10 AMUpdated Feb 26, 2024 | 10:10 AM
TS: తెలంగాణ మహిళలకు శుభవార్త.. ఆ పథకాన్ని మళ్లీ తీసుకొస్తున్న సర్కార్‌

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప్రజా పాలనను విజయవంతంగా మొదలు పెట్టారు. కాగా, ఇప్పటికే మహాలక్ష్మీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలు ప్రారంభించారు. అలాగే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణన్ని అమలు చేశారు. దీంతో పాటు ఆరోగ్య శ్రీ బీమా పరిధిని రూ. 10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి తెలంగాణ రాష్ట్ర మహిళల అభివృద్ధి కోసం సర్కార్ ఓ శుభవార్తను తెలియజేసింది. అదేమిటంటే..

తాజాగా తెలంగాణ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం ఓ మంచి శుభవార్తను అందించింది. త్వరలో రాష్ట్ర మహిళల కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో చెప్పుకొచ్చారు. అయితే స్వయ సహాయక బృందాలకు సున్నా వడ్డీతో రుణాలు అందించే సరికొత్త ప్రభుత్వ స్కీమ్ ను అతి త్వరలో తిరిగి ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ పథకం ద్వారా దాదాపు లక్ష మంది మహిళలకు లాభం చేకూరుతుందని ఆయన తెలిపారు. అలాగే ఈ స్కీమ్ ద్వారా మహిళల్లో స్వయం సంపాదిత వృద్ధి కూడా భారీగా పెరుగుతుందన్నారు. ఇక దీంతో పాటు సింగరేణిలో పనిచేస్తున్న 43 వేల మంది కార్మికులకు రూ. కోటి విలువైన ఇన్సూరెన్స్ ను అందించే కార్యక్రమాన్ని రేపే ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.

కాగా, ఇటీవలే మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈమేరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అలాగేఈనెల 27 నుంచి అమలు చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక అందులో భాగంగానే రూ. 500 కే గ్యాస్ సిలిండర్, అలాగే ఉచిత విద్యుత్ స్కీమ్ లను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీంతోపాటు గ్యాస్ సిలిండర్ సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలా లేదా గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించాలా అనే విషయాన్ని పరిశీలించాలని అధికారులను సూచించారు. మరి త్వరలో మహిళల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నా కొత్త స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.