iDreamPost
android-app
ios-app

తెలంగాణలో భారీగా పెరిగి ఎన్నికల బందోబస్తు ఖర్చు.. ఎంతంటే?

తెలంగాణలో ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.. 30న ఎన్నికలు, డిసెంబర్ 3 న ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను సజావుగా జరిపేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణలో ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.. 30న ఎన్నికలు, డిసెంబర్ 3 న ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను సజావుగా జరిపేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణలో భారీగా పెరిగి ఎన్నికల బందోబస్తు ఖర్చు.. ఎంతంటే?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి.. ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈసారి తెలంగాణలో ప్రధాన పార్టీలు ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తెలంగాణలో జరగబోయే ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బందోబస్తు ఖర్చు భారీగా పెరుగుతుందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.. 30న ఎన్నికలు, డిసెంబర్ 3 న ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను సజావుగా జరిపేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బలగాలతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే రాష్ట్ర పోటీసుల భత్యాలు, వాహనాలకు అయ్యే ఖర్చు దాదాపు రూ.150 కోట్ల వరకు ఖచ్చ అవుతుందని టాక్ వినిపిస్తుంది. గత ఎన్నికల్లో రూ.100 కోట్ల ఖర్చు కాగా, ఇప్పుడు మాత్రం రూ.150 కోట్ల వరకు బందోబస్తు ఖర్చు ఉండవొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దేశంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయి.. ఫలితాలు వెలువడే వరకు పోలీసులు విధుల్లో ఉండాల్సిందే. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ నేతలు రక రకాల జిత్తులు వేస్తుంటారు. మద్యం, డబ్బులు, బంగారం, వెండి, చీరలు ఇతర వస్తువులు పంచే ప్రయత్నాలు చేస్తుంటారు. పోటీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్నవాటిని తనిఖీలు చేసి పట్టుకొని సీజ్ చేస్తుంటారు.

తనిఖీల కోసం అక్టోబర్ 9 నుంచి రాష్ట్రంలో 373 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 374 స్టాటిక్ సర్వే లైన్స్ టీమ్స, 95 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి వంద కంపెనీల పారామిలటరీ బలగాలు వచ్చాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర పోలీసు సిబ్బంది 60 వేల మంది వరకు ఉన్నారు. మరో 300 కంపెనీల పారా మిలటరీ బలగాలు కావాల్సి వస్తుందని కేంద్రాన్ని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి పదివేల మంది పోలీసులు బలగాలు కూడా అందుబాటులో ఉంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.