iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ లో ఆ 19 స్థానాలు పెండింగ్‌లో ఎందుకు? సీఎంపై పోటీ ఎవరు?

  • Published Oct 28, 2023 | 2:07 PM Updated Updated Oct 28, 2023 | 2:16 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ప్రధాన పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖారారు చేసి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ప్రధాన పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖారారు చేసి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.

కాంగ్రెస్ లో ఆ 19 స్థానాలు పెండింగ్‌లో ఎందుకు? సీఎంపై పోటీ ఎవరు?

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సొంతం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు నువ్వా.. నేనా అనే విధంగా పోటీ పడుతున్నాయి. ఎవరి వ్యూహాలతో వారు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిచి హ్యట్రిక్ కొట్టేయాలని బీఆర్ఎస్ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతుంది. అధికార పార్టీని ఎలాగైనా గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పట్టుదలతో ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే సమయానికే ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు బీ-పారాలు కూడా ఇస్తుంది. ఇక కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచీ..తూచీ నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం. ఈసారి బీఆర్ఎస్ కి చెక్ పెట్టాలంటే సరైన అభ్యర్థి అయి ఉండాలి.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తుంది. ఆ మద్య 55 మంది అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయగా.. నిన్న శుక్రవారం సాయంత్రం మరో 45 మంది అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది. మొత్తానికి కాంగ్రెస్ 100 మంది అభ్యర్ధుల పేర్లు ఖారారు చేసింది.. కాకపోతే మిగిలిన 19 స్థానాల విషయంలో తర్జన భర్జన కొనసాగుతుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ కి చెక్ పెట్టి తాము అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే సీనియర్ నేతలు తెలంగాణలో కాంగ్రెస్ ఆకర్ష్ ని మొదలు పెట్టారు. పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతో బలం చేకూరుతుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది.. అదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్ని అంశాల్లో ప్రణాళికబద్దంగతా ముందుకు సాగుతుంది. 6 గ్యారెంటీలు, మేనిఫెస్టో, ప్రచారం ఇలా అన్ని అంశాలతో పాటు గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తూ టికెట్ కేటాయించే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం 45 మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేశారు. ఈ నెల 23న మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థుల పేర్లు ఖారారు చేయగా, నిన్న శుక్రవారం 27వ తేదీన 45 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులు పూర్తయ్యారు.. కానీ మరో 19 నియోజకవర్గాలు మిగిలి ఉన్నాయి.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఆ 19 స్థానాలు ఎంతో కీలకం కానున్నాయని టాక్. అందుకే ఆ 19 స్థానాల అభ్యర్థులను లీస్టును హైకమాండ్ పెండింగ్ లో ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 19 స్థానాల అభ్యర్థులను ఎందుకు పెండింగ్ లో పెట్టింది? గెలుపు గుర్రాలు ఇంకా ఖరారు కాలేదా? అసలు కాంగ్రెస్ హైకమాండ్ మనసులో ఏముందీ? అనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇక పెండింగ్ లో ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన నియోజకవర్గాలే ఉన్నాయి. 19 సీట్లలో 4 కమ్యూనిస్టులకు కేటాయించినప్పటికీ.. మిగిలిన నియోజకవర్గాలు ఖమ్మం జిల్లా ఇల్లందు, అశ్వరావుపేట, సత్తుపల్లి సీట్లు ఇంకా ప్రకటించలేదు. ఇక నల్లగొండ జిల్లా విషయానికి వస్తే.. తుంగతుర్తి, సూర్యపేట అభ్యర్థుల విషయంలో తర్జన భర్జన కొనసాగుతుంది. నిజామాబాద్ అర్బన్ లో జుక్కల్, పటాన్ చెరు, బాన్సువాడ, కరీంనగర్, నారాయణ పేట్ నియోజకవర్గాలు అభ్యర్థుల విషయంలో సస్పెన్షన్ కొనసాగుతుంది. అయితే ఈ జాబితా మరో రెండుమూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీలో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.