iDreamPost
iDreamPost
బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam) తెలంగాణలో రాజకీయ సంచలనాలు కనిపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ, బీజేపీ లీడర్లు ఆమె ఇంటిదగ్గర సోమవారం నిరసనకు దిగారు. పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి, వివిధ సెక్షన్ లకింద కేసులు నమోదు చేశారు. దీనిపై బీజేపీ రగిలిపోయింది. నిరసనగా జనగామ జిల్లా స్లేషన్ ఘన్ పూర్ మండలం, పామ్నూర్ లో పాద యాత్ర శిబిరం వద్ద, బండి సంజయ్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోబోయారు. బండి సంజయ్ చుట్టూ వలయంలా నిలిచారు. చివరకు పాద యాత్ర శిబిరం వద్దకు పోలీసులు వచ్చారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ నేతల అరెస్ట్‌లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారు. విష ప్రచారం చేస్తున్నారు. అదేంటని అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబ, ప్రజా వ్యతిరేక పాలన నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి కలుగుతుంది. ప్రజలు కూడా ఇదే ఆశిస్తున్నారని వ్యాఖ్యానించారు.
అరెస్టులపై బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు అన్ని మండలాల్లో పార్టీ ఆఫీసుల వద్ద నిరసనలు నిర్వహిస్తోంది. ఇక, ఉప్పుగల్, కూనూర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోటీ ఆందోళనకు దిగారు.