జగన్ గారు మావాళ్లను కాపాడండి – లాలూ తనయుడు

  • Published - 04:12 AM, Sat - 28 March 20
జగన్ గారు మావాళ్లను కాపాడండి – లాలూ తనయుడు

బీహార్ నుండి కూలి పనుల కోసం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిక్కుకు పోయిన తమ వారిని మానవత దృక్పథం తో ఆదుకోవాలని బీహార్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి విజ్నప్తి చేశారు.

ముఖ్యంగా విశాఖపట్నం సమీపంలోని లంకెలపాలెం, పరవాడలో ఎన్టీపీసీ లో బీహార్ కూలీలు చిక్కుకుపొయ్యారని తేజస్వి యాదవ్ తెలిపారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో తమ రాష్ట్రానికి చెందిన కూలీలు తింటానికి తిండి, తిప్పలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి సరుకులు భోజనం అందజేసి వారిని సహృదయంతో ఆదుకోవాలని తేజస్వి విజ్నప్తి చేశారు.

ఈ మేరకు భాదితులు చేసిన ట్విట్ ను తేజస్వి యాదవ్ రీ-ట్విట్ చేస్తూ దానికి ఏపీ సీఎం జగన్ కు, విశాఖపట్నం కలక్టర్ కు ట్యాగ్ చేశాడు. ఈ ట్విట్ పై స్పందించిన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది తేజస్వి యాదవ్ ను అభినందించాడు.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో విశాఖపట్నం లో చిక్కుకుపొయిన తమ రాష్ట్ర వాసులు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పిన వెంటనే.. సీఎం వైయస్ జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ అద్భుతంగా స్పందించారని వారికి తమ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృతఙ్ఞతలు తెలుపుతున్నామని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెనూ ఖండు ట్విట్ చేయడం విశేషం.

Show comments