iDreamPost
iDreamPost
WhatsApp ఇటీవలే ఫైల్ షేరింగ్ లిమిట్ ను 2జీబీకి పెంచింది. అంటే వాట్సప్ యూజర్లు 2GB వరకు ఫైల్స్ ను పంపించుకోవచ్చు. మరి జీమెయిల్ లాంటి ఇతర ప్లాట్ ఫామ్ లు ఎంతవరకు షేరింగ్ కు అవకాశమిస్తున్నాయి?
WhatsApp ఇటీవలే ఫైల్ ట్రాన్స్ ఫర్ లిమిట్ 100ఎంబీ నుంచి 2GB వరకు పెంచింది. WhatsApp యూజర్లు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను గ్రూపుల్లోనూ, వ్యక్తిగతంగానూ షేర్ చేసుకోవచ్చు.
అదే జీమెయిల్ మాత్రం 25MB వరకు ఫోటోలు, డాక్యుమెంట్లు, వీడియోలను attachment గా షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం Google Driveలో అప్ లోడ్ చేసి, లింక్ ను షేర్ చేసుకొనే అవకాశమముంది.
Microsoft Outlookలో ఇంతకన్నా తక్కువ అంటే 20MB వరకు మాత్రం attachmentగా పంపించుకోవచ్చు.
అంతకన్నా పెద్ద ఫైల్స్ ను OneDrive attachments షేర్ చేసుకోవచ్చు.
Telegram బాగా పాపులర్ కావడానికి కారణం, 2GB వరకు fileను షేర్ చేసుకొనే అవకాశం ఇవ్వడమే. 2జీబీ వరకు ఫైల్స్ అంటే, టెలీగ్రామ్. ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ ను పంపించుకోవచ్చు. లిమిట్ మాత్రం 2 GB మాత్రమే.
Signal మాత్రం 200MB వరకు file transfer చేసుకొనే అవకాశం ఇస్తుంది. 6ఎంబీకి మించకుండా ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. అదే వీడియాలు మాత్రం 200MB వరకు అవకాశముంది. ఇతర డాక్యుమెంట్లను మాత్రం 100MB వరకు పంపించుకోవచ్చు.
Instagram ఇంకాస్త బెటర్. 650MB ఇమేజేస్, వీడియోలను పంపించుకోవచ్చు. వీటిని Direct Messages ద్వారా షేర్ చేసుకోవచ్చు. లిమిట్ మాత్రం 650MB.
Google Chat వాడుతున్నారా? ఇక్కడ 200MB వరకు file transfer చేసుకోవచ్చు.
Facebook Messengerలో ప్రస్తుతం 25MB లోపు ఫైల్స్ ను షేర్ చేసుకోవచ్చు. అంటే ఆడియో, వీడియో, ఇమేజెస్, ఫైల్స్ ను పంపుకోవచ్చు. ఈ లిమిట్ ను త్వరలో పెంచొచ్చన్నది నిపుణుల మాట.
అదే Skypeలో మీరు 300MB వకు ఫైల్స్ ను షేర్ చేసుకోవచ్చు. యూజర్లకు photos, videos ఇతర ఫైల్స్ ను షేర్ చేసుకొనే అవకాశమిస్తోంది Skype. లిమిట్ మాత్రం 300MB, అంతకన్నా తక్కువ.
ఉద్యోగాలను వెతుక్కొనే Linkedinలో 100MB వరకు ఫైల్స్ ను షేర్ చేసుకోవచ్చు. ఇది కేవలం డాక్యుమెంట్స్ ను మాత్రం అనుమతిస్తుంది. అదికూడా 300 పేజీలు, అంతకన్నా తక్కువ ఇమేజ్ ఫైల్స్ ను మాత్రమే షేర్ చేసుకోవచ్చు.
కరోనాతో బాగా పాపులర్ అయిన Zoomలో 512MB వరకు ఫైల్స్ ను షేర్ చేసుకోవచ్చు. ఆడియో, వీడియో, ఏదైనాసరే పంపుకోవచ్చు.