iDreamPost
android-app
ios-app

అసెంబ్లీలో టీడీపీ ధర్నా

  • Published Dec 17, 2019 | 5:02 AM Updated Updated Dec 17, 2019 | 5:02 AM
అసెంబ్లీలో టీడీపీ ధర్నా

ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు తో పాటు, టీడీపీ నాయకులపై జరుగుతున్న దాడులు ఆపాలని మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు.
అసెబ్లీ సమావేశాలలో భాగంగా చివరి రోజు కూడా టీడీపీ సభ్యులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీ కి హాజరయ్యారు. 7రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ప్రతిరోజూ టీడీపీ సభ్యులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఇక చివరి రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. తొలుత అసెంబ్లీ కి సమీపంలో ఉన్న ఫైర్ స్టేషన్ నుండి ర్యాలీగా బయల్దేరి అసెబ్లికి చేరుకున్నారు. అసెంబ్లీ హాల్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పై దాడులు ఆపాలని, ఉపాధిహామీ బిల్లులు చెల్లించాలని పెద్దయెత్తున నినాదాలు చేశారు. అనంతరం సభలోకి ప్రవేశించారు.