iDreamPost
iDreamPost
శాసనమండలిలో ఆధిక్యాన్ని ఆసరాగా చేసుకుని రెండేళ్లుగా టీడీపీ పలు అడ్డంకులు సృష్టించింది. ప్రభుత్వ విధానాల అమలుకు ఆటంకం కల్పించేయత్నం చేసింది. దాంతో ఒకసమయంలో మండలి రద్దు చేయాలని సీఎం జగన్ సంకల్పించారు. కానీ తీరా కేంద్రం నుంచి దానికి అనుగుణంగా సమ్మతి లేకపోవడంతో పార్లమెంట్ తీర్మానం జరగలేదు. అనివార్యంగా ఇన్నాళ్లు వేచిచూసిన పాలక పక్షం ఇప్పుడు ఆధిక్యాన్ని సాధించింది.
అసెంబ్లీలో ప్రజల మద్దతు మూలంగా జగన్ ప్రభుత్వం పూర్తి మెజార్టీ సాధించింది. కానీ మండలిలో మాత్రం ఆరేళ్ళ పదవి కాలం ఉండడంతో ఇన్నాళ్లుగా టీడీపీ ఎమ్మెల్సీల హవా సాగింది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్, యనమల సహా పలువురు నేతలు ఇక్కడ చక్రం తిప్పేయత్నం చేశారు. పాలన4 వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో నేరుగా చంద్రబాబు గ్యాలరీలోకి వెళ్లి చైర్మన్ ని ప్రభావితం చేశారు. అయితే గడిచిన రెండు నెలల్లో టీడీపీ కి చెందిన 10మంది ఎమ్మెల్సీలు రిలీవ్ అయ్యారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ కి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్సీలు అడుగుపెట్టారు. దాంతో ఇప్పుడు టీడీపీ బలం 15 కి పడిపోగా, వైఎస్సార్సీపీ 21 కి చేరింది. బీజేపీ కూడా ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్సీ కే పరిమితం అయ్యింది. పిడీఎఫ్ తరుపున ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలలో అత్యధికులు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. దాంతో పాలక పార్టీకి పూర్తి ఆధిక్యం దక్కినట్టే భావించాలి.
ప్రస్తుతం స్థానికసంస్థలు కోటాలో గెలిచిన 8మంది పదవీకాలం ముగిసింది. వారిలో టీడీపీ నుంచి రెడ్డి సుబ్రమణ్యం,వైవీబీ, బుద్దా వెంకన్న, పప్పల చలపతి రావు, గాలి సరస్వతి, ద్వారపు రెడ్డి జగదీశ్వరరావు, బుద్దా నాగ జగదీశ్వరరావు ఉన్నారు. మండలిలో వైఎస్సార్సీపీ చీఫ్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా రిలీవ్ అయ్యారు. దాంతో ఖాళీల సంఖ్య 11కి చేరింది. కరోనా కారణంగా కొంత ఆలస్యం అయినా ఈ సీట్లు కూడా దాదాపుగా జగన్ శిబిరంలో చేరేవే. కాబట్టి ఇక టీడీపీ కి కొత్త కష్టాలు మొదలయినట్టేనని చెప్పాలి.
మండలిలో మెజారిటీ ఉపయోగించి అన్ని అంశాల్లో అడ్డుపుల్లలు వేసిన ప్రతిపక్ష ఎమ్మెల్సీలకు ఈసారి అక్కడ కూడా పాలక పక్షం నుంచి సవాళ్లు తప్పవు. కీలక బిల్లులు కూడా తిప్పి పంపిస్తు, ప్రభుత్వాన్ని చికాకు పెట్టడమే లక్ధ్యంగా సాగిన టీడీపీ ఆటలు ఇక సాగె అవకాశం లేదు. అదే సమయంలో నారా లోకేష్ వంటి అనుభవరాహిత్యం తో.మాట్లాడే నేతలకు కష్టతరమే అని చెప్పవచ్చు.